Doping in Cricket: క్రికెట్‌లో డోపింగ్ టెస్ట్ ఉంటుందా.. దోషిగా తేలితే ఎలాంటి శిక్షలు ఉంటాయి? పూర్తి వివరాలు మీకోసం..

బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఒక స్వతంత్ర సంస్థ. భారత జట్టు విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా విదేశీ జట్లు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే మంత్రిత్వ శాఖ నోడల్ విభాగంగా పాల్గొంటుంది.

Doping in Cricket: క్రికెట్‌లో డోపింగ్ టెస్ట్ ఉంటుందా.. దోషిగా తేలితే ఎలాంటి శిక్షలు ఉంటాయి? పూర్తి వివరాలు మీకోసం..
Bcci
Follow us
Venkata Chari

|

Updated on: Feb 15, 2023 | 1:13 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలతో.. ప్రస్తుతం దుమారం రేగుతోంది. గాయపడిన చాలా మంది భారత ఆటగాళ్లు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి ఇంజెక్షన్లు తీసుకుంటారని చేతన్ శర్మ ఆరోపించారు. ఇటీవలే మరోసారి నియమితులైన చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఓ ప్రైవేట్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయాలు వెల్లడించారు. గత ఒకటి, రెండేళ్లుగా భారత క్రికెట్ జట్టులోని ఆటగాళ్ల ఫిట్‌నెస్ చాలా ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా గత సంవత్సరంలో, టీమిండియాలో చాలా మంది సీనియర్ నుంచి కొత్త ఆటగాళ్లు గాయపడటం, దీని కారణంగా చాలా మ్యాచ్‌లు మిస్ అయిన సంగతి తెలిసిందే. జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత కూడా కొందరు ఆటగాళ్లు గాయాలపాలవుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ ఎందుకు తక్కువగా ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా చేతన్ శర్మ ఒక ప్రైవేట్ ఛానెల్ స్టింగ్‌లో ఈ ఆరోపణలను వెల్లడించాడు. దీంతో ప్రస్తుతం అందరిలోనూ ఓ ప్రశ్న మొదలైంది. అసలు క్రికెట్‌లో డోపింగ్ టెస్టులు ఉంటాయా? క్రికెటర్లు ఫిట్‌నెస్ కోసం డ్రగ్స్ తీసుకుంటారా? అనే విషయాలపై తెలుసుకోవడం మొదలుపెట్టారు. క్రికెట్‌లో అసలు డోపింగ్ టెస్టులు ఉన్నాయా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఒక స్వతంత్ర సంస్థ. భారత జట్టు విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా విదేశీ జట్లు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే మంత్రిత్వ శాఖ నోడల్ విభాగంగా పాల్గొంటుంది. ఈ సంస్థపై కేంద్ర మంత్రిత్వ శాఖకు నియంత్రణ ఉండదు. ఆటతీరును మెరుగుపరిచే డ్రగ్స్‌లో క్రికెటర్లు పాల్గొనడం వల్ల సమస్య ఉంటే, బీసీసీఐ దానిని పరిష్కరించాల్సి ఉంటుంది.

బీసీసీఐ ఈ విషయాన్ని ఎలా చూస్తుంది?

ఇది చాలా తీవ్రమైన సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది. బీసీసీఐ కూడా ఈ సమస్యను విస్మరించ కూడదు. ఎందుకంటే ఇది బీసీసీఐ విశ్వసనీయతను కోల్పోయేలా చేస్తోంది. ఏదైనా తేడాలు వస్తే బీసీసీఐ చాలా నష్టపోతుంది. ఆటగాళ్ళు డ్రగ్స్ వాడినట్లు తేలితే విశ్వసనీయతకు భంగం ఏర్పడుతుంది. ఈ విషయంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మాజీ కేంద్ర క్రీడా శాఖ మంత్రి తన హయాంలో చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ఈ పరిణామాలపై ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రీడా ప్రపంచం ఈ సమస్యపై సున్నితంగా ఉంటుంది. డ్రగ్స్ తీసుకుని ఏదైనా సాధిస్తే దానికి విలువ లేదు. కాబట్టి, క్రీడల్లో నిజమైన స్ఫూర్తి పూర్తిగా మసకబారుతుంది. అందువల్ల, బీసీసీఐ, క్రికెట్ సమాఖ్యలు, ఈ విషయం తీవ్రత గురించి ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవాలని’ కోరుకుంటున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

సమస్య ఎంత తీవ్రంగా ఉంటుంది?

డోపింగ్‌కు సంబంధించిన మొత్తం ప్రశ్నను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఒక క్రికెటర్ లేదా అథ్లెట్ నాలుగు కప్పుల కాఫీ లేదా అదనపు దగ్గు సిరప్ కలిగి ఉంటే, అతను లేదా ఆమె పరీక్షలో పాజిటివ్ అని తేలే ఛాన్స్ ఉంటుంది. డ్రగ్ తీసుకోవడం, పాజిటివ్ పరీక్షలు చేయడం అంటే ఏమిటో సరైన అవగాహన లేకుండా, ఈ టెస్టులు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ముందుగా ప్రతీ క్రీడాకారుడికి ఎలాంటి ఔషధాలు వాడొచ్చు, ఎలాంటివి వాడకూడదో వివరించాలి. ఫిట్‌నెస్ కోసం, ఇతర ఆనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వారిపై ఓ కన్నేసి ఉంచాల్సి బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. కొన్ని రకాల మందులు కూడా డోపింగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను ఆటగాళ్లకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డోప్-టెస్టింగ్‌పై సమగ్ర వ్యవస్థ కోసం ఐసీసీ ఆలోచనలు..

అయితే, కొన్ని దేశాలు తమ ఆటగాళ్లకు డ్రగ్స్‌ అందిస్తుంటాయని చాలా సార్లు వార్తల్లో వచ్చాయి. దీంతో వారు క్రీడల్లో గుర్తింపు పొందగలరు. ఇది చాలా సాంకేతిక ప్రక్రియ. అలా ప్రీ ప్లాన్డ్‌గా చేస్తే.. గుర్తించడం చాలా కష్టం. డోప్-టెస్టింగ్‌లో ఉన్న అన్ని సంక్లిష్టతలను అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డోప్ టెస్టింగ్‌పై సమగ్రమైన వ్యవస్థను రూపొందించే ప్రక్రియలో నిమగ్నమైంది. ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాల్సి ఉంటుంది. అసలు క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు ఎలా చేస్తారో కూడా ప్రకటించాల్సి ఉంటుంది.

దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచ కప్‌లో మొదటిసారి డోప్-పరీక్షలు..

కాగా, దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచ కప్‌లో మొదటిసారిగా యాదృచ్ఛిక డోప్-పరీక్షలను ఐసీసీ నిర్వహించింది. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. దీంతో ఐసీసీ వెనక్కు తగ్గింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ పట్టుబడ్డాడు. షేన్ వార్న్ డయ్యూరిటిక్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన తర్వాత ప్రపంచ కప్ నుంచి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. “నేను ఫ్లూయిడ్ రిడక్షన్ టాబ్లెట్ తీసుకున్నాను.. అందులో నిషేధిత పదార్ధం ఉందని నాకు తెలియదు” అని వార్న్ గట్టిగా చెప్పుకొచ్చాడు. “టాబ్లెట్ వాస్తవానికి మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది. శరీరంలోని ఏదైనా అదనపు ద్రవాన్ని తొలగిస్తుంది” అంటూ ఆనాడు వాదించాడు. దీంతో డోపింగ్ టెస్టులపై ఐసీసీ వెనక్కు తగ్గింది.

దోషిగా తేలిన క్రికెటర్‌కి శిక్ష ఉంటుందా?

అయితే, ఇక్కడ చాలా విషయాలను పరిశీలించాల్సి ఉంటుంది. అసలు వారు ఎలాంటి పదార్థాలు తీసుకున్నారో చూడాల్సి ఉంటుంది. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పెనాల్టీల విషయానికి వస్తే క్రికెట్ సమాఖ్యలు ఇంతవరకు ఎలాంటి వ్యవస్థను రూపొందించలేదు. క్రికెట్ బోర్డులకు శిక్షలు విధించే అధికారం కూడా ఉండదు.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..