AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26 బంతుల్లో 124 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. ఆర్‌సీబీ ప్లేయర్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఎప్పుడో తెలుసా!

టీ20ల్లో విధ్వంసకర బ్యాటర్లలో ఒకరు. క్రీజులోకి వస్తే బౌలర్లపై బౌండరీల రూపంలో విరుచుకుపడటం ఖాయం. అలాగే ఈ పొట్టి ఫార్మాట్‌లో..

26 బంతుల్లో 124 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. ఆర్‌సీబీ ప్లేయర్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఎప్పుడో తెలుసా!
Aaron Finch
Ravi Kiran
|

Updated on: Nov 16, 2021 | 3:57 PM

Share

టీ20 విధ్వంసకర బ్యాటర్లలో ఒకరు. క్రీజులోకి వస్తే బౌలర్లపై బౌండరీల రూపంలో విరుచుకుపడటం ఖాయం. అలాగే ఈ పొట్టి ఫార్మాట్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసి రికార్డుల్లోకి ఎక్కాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ అందించి ఛాంపియన్‌గా నిలిచాడు. అతడెవరో కాదు ఆరోన్ ఫించ్. ఇవాళ ఆరోన్ ఫించ్ పుట్టినరోజు. ఆస్ట్రేలియా జట్టుకు టీ20 ప్రపంచకప్‌ను అందించిన తొలి కెప్టెన్ ఫించ్.. అతడికి ఈ బర్త్ డే ఎంతో స్పెషల్ అని కూడా చెప్పొచ్చు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆసీస్ అద్భుత విజయాన్ని సాధించి ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. 21 ఏళ్ల వయస్సులో ఆరోన్ ఫించ్ విక్టోరియా తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2006 అండర్-19 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. మొదటిగా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నించిన ఫించ్.. ఆ తర్వాత పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్‌గా మారాడు. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో ఫించ్ కేవలం 33 బంతుల్లో అజేయంగా 53 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే అనూహ్యంగా ఫించ్‌ను జట్టు నుంచి తీసేశారు. ఏడాది నిరీక్షణ అనంతరం 2012లో మరోసారి టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు.

ఆరోన్ ఫించ్ తన 7వ టీ20 మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ కేవలం 63 బంతుల్లో 14 సిక్సర్లు, 11 ఫోర్లతో 156 పరుగులు చేశాడు. అలాగే 2018లో జింబాబ్వేపై ఫించ్ 76 బంతుల్లో 172 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టాడు. ఆంటే.. బౌండరీల రూపంలోనే ఏకంగా 124 పరుగులు రాబట్టాడని చెప్పొచ్చు. ఆరోన్ ఫించ్ టీ20లలోనే కాదు.. వన్డే క్రికెట్‌లోనూ తన సత్తా చాటాడు. ఆస్ట్రేలియా తరపున 132 వన్డేల్లో 41.85 సగటుతో 17 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలతో 5232 పరుగులు చేశాడు. ఇక 2019లో ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్టులకు ఫించ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే.

Also Read:

  1. Viral Video: పాముకు ఎలుక చిక్కితే ఎట్టుంటుందో తెలుసా.? ఫైట్ మాములుగా లేదు.. షాకింగ్ వీడియో.!
  2. 21 సిక్సర్లు, 16 ఫోర్లు.. సూపర్ ఫాస్ట్ డబుల్ సెంచరీతో బౌలర్లపై వీరవిహారం.. ఆ ఆటగాడు ఎవరంటే.!
  3. Viral News: గోడ నుంచి వింత శబ్దాలు.. బద్దలు కొట్టి చూడగా రెస్క్యూ సిబ్బంది ఫ్యూజులు ఔట్.!
  4. Viral Photo: ఈ ఫోటోలో మంచు చిరుతను కనిపెట్టండి చూద్దాం.. పజిల్ అంత ఈజీ కాదండోయ్.!
  5. Viral Video: ఇదేం ‘మాస్’ క్రియేటివిటీ మావా.! ఈ వ్యక్తి చేసిన పనికి ఇంజనీర్లు సైతం నోరెళ్లబెడతారు..