AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2022 T20 World Cup : వచ్చే ఏడాది టీ 20 వరల్డ్‌కప్‌ వేదికలు ఖరారు.. మెల్‌బోర్న్‌లో నవంబర్‌ 13న ఫైనల్‌..

ఇటీవల దుబాయి వేదికగా జరిగిన టీ- 20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.

2022 T20 World Cup :  వచ్చే ఏడాది టీ 20 వరల్డ్‌కప్‌ వేదికలు ఖరారు.. మెల్‌బోర్న్‌లో  నవంబర్‌ 13న ఫైనల్‌..
Basha Shek
| Edited By: Team Veegam|

Updated on: Nov 16, 2021 | 2:19 PM

Share

ఇటీవల దుబాయి వేదికగా జరిగిన టీ- 20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఐసీసీ రెండేళ్లకొకసారి ఈ పొట్టి ప్రపంచకప్‌ నిర్వహిస్తోంది. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా టోర్నీలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో మరో ఏడాదిలోనే టీ- 20 ప్రపంచకప్‌ జరగనుంది. తాజా ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు జరిగే ఈ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలను అక్కడి అధికారులు ఖరారు చేశారు. మొత్తం 7 నగరాల్లో ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరుగుతాయని, చారిత్రాత్మక మెల్‌బోర్న్‌ మైదానంలో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ నిర్వహిస్తామని ఐసీసీ ఈవెంట్స్‌ హెడ్‌ క్రిస్‌ టెట్లీ తెలిపారు.

మొత్తం 45 మ్యాచ్‌లు.. కాగా గతేడాది జరిగిన మహిళల టీ-20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియానే ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్ఫూర్తితోనే మరో ప్రతిష్ఠాత్మక టోర్నీని నిర్వహించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. ఈ టోర్నీలో మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. అడిలైడ్‌, బ్రిస్బేన్‌, పెర్త్‌, హోబర్ట్‌, సిడ్నీ, గీలాంగ్‌, మెల్‌బోర్న్‌ నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. తాజా ఫైనల్‌లో తలపడిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లతో పాటు భారత్‌, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు నేరుగా సూపర్‌- 12కు అర్హత సాధిస్తాయి. మిగతా నాలుగు స్థానాల కోసం శ్రీలంక, వెస్టిండీస్‌ తదితర జట్లు క్వాలిఫయింగ్‌ టోర్నీల్లో తలపడనున్నాయి. సిడ్నీ, అడిలైడ్‌లలో సెమీస్‌లు జరగనుండగా, నవంబర్‌ 13న మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

Also Read:

T20 World Cup 2021: కొన్నిసార్లు సూర్యోదయం కాస్త ఆలస్యం కావొచ్చు.. వార్నర్‎పై ప్రశంసలు కురిపించిన మాజీ క్రికెటర్..

Cricket: షార్ట్‌ పిచ్‌ బంతికి ఎగిరి పడిన బ్యాటర్‌ హెల్మెట్‌.. తప్పిన ప్రమాదం.. వైరలవుతోన్న వీడియో..

Rashid Khan: కేన్ మామ.. వార్నర్ కాకా.. వైరల్ అవుతోన్న రషీద్ ఖాన్ ట్వీట్..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!