T20 World Cup 2024: భారత్, పాక్ ఆటగాళ్లతో సిద్ధమైన అమెరికా జట్టు.. రోహిత్, బాబర్‌లను ఢీ కొట్టేందుకు సిద్ధం.. లిస్ట్ చూస్తే పరేషానే..
T20 World Cup 2024 USA Squad: టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ నెలలో అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆతిథ్యమిచ్చి తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న అమెరికా జట్టును కూడా ప్రకటించింది. ఇందులో అమెరికాకు విజయాన్ని అందించడానికి భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు కలిసి పనిచేయనున్నారు.

T20 World Cup 2024 USA Squad: టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ నెలలో అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆతిథ్యమిచ్చి తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న అమెరికా జట్టును కూడా ప్రకటించింది. ఇందులో అమెరికాకు విజయాన్ని అందించడానికి భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు కలిసి పనిచేయనున్నారు. ఇందులో 15 మంది సభ్యులతో కూడిన జట్టులో భారత్‌కు చెందిన ఏడుగురు, పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ ఇండియా-పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఉన్న టీమ్ ఇండియాతోపాటు, బాబర్ సేన సారథ్యంలోని పాకిస్తాన్ జట్లతో పోటీపడతారు. ఎందుకంటే అమెరికా, భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.
T20 ప్రపంచ కప్ 2024 USA జట్టు: మోనాంక్ పటేల్ (ఇండియన్-అమెరికన్ కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, కోరీ అండర్సన్ (న్యూజిలాండ్), అలీ ఖాన్ (పాకిస్తాన్), హర్మీత్ సింగ్ (భారతదేశం), జెస్సీ సింగ్, మిలింద్ కుమార్ (భారతదేశం), నిసర్గ్ పటేల్ (భారతదేశం), నితీష్ కుమార్ (భారతదేశం), నోష్టుష్ కెంజిగే, సౌరభ్ నేత్రలావ్కర్ (భారతదేశం), షాడ్లీ వాన్ షాల్క్‌విక్, స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్.
రిజర్వ్ ఆటగాళ్లు: గజానంద్ సింగ్, జువానోయ్ డ్రైస్‌డేల్, యాసిర్ మహ్మద్.
A former New Zealand international has been named in USA’s 15-member squad for the ICC Men’s #T20WorldCup 2024.
More 👇https://t.co/lViNopIDbE
— ICC (@ICC) May 3, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..