AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ముగిసిన టీమిండియా ఇన్నింగ్స్‌.. చివర్లో పాండ్యా మెరుపులు! కివీస్‌ టార్గెట్‌ ఎంతంటే..?

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 249 పరుగులు చేసింది. ప్రారంభంలో గిల్, రోహిత్, కోహ్లీ త్వరగా అవుట్ అయ్యారు. అయ్యర్ (79) మరియు అక్షర్ (42) గుణపరమైన భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. హార్దిక్ పాండ్యా 45 పరుగులతో మెరిపించాడు. 250 పరుగుల లక్ష్యం న్యూజిలాండ్‌కు సవాలుగా ఉంటుందని అంచనా.

IND vs NZ: ముగిసిన టీమిండియా ఇన్నింగ్స్‌.. చివర్లో పాండ్యా మెరుపులు! కివీస్‌ టార్గెట్‌ ఎంతంటే..?
Hardik Pandya
SN Pasha
|

Updated on: Mar 02, 2025 | 6:25 PM

Share

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ చివర్లో స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా మెరుపులు మెరిపించాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. మొత్తంగా టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 30 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది భారత్‌. గిల్‌ 2, రోహిత్‌ 15, కోహ్లీ 11 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యారు. ఆ తర్వాత అక్షర్‌ పటేల్‌తో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఆ తర్వాత అక్షర్‌ 42 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు.

కేఎల్‌ రాహుల్‌ 23, రవీంద్ర జడేజా 16 పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక బాగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న శ్రేయస్‌ అయ్యర్‌ తన షార్ట్‌ బాల్‌ వీక్‌నెస్‌కు మరోసారి బలయ్యాడు. 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 79 పరుగులు చేసి విలియమ్‌ రూర్కీ బౌలింగ్‌లో విల్‌ యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. చివర్లో షమీ 5 రన్స్‌ చేసి అవుట్‌ అయ్యాడు. కుల్దీప్‌ ఒక రన్‌తో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా న్యూజిలాండ్‌ ముందు టీమిండియా 250 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. పిచ్‌ కండీషన్‌ దృష్ట్యా ఈ టార్గెట్‌ అంత ఈజీ కాకపోవచ్చు. డ్యూ లేకుంటే మాత్రం టీమిండియా స్పిన్‌ ఎటాక్‌ను తట్టుకొని కివీస్‌ బ్యాటర్లు నిలబడటంపైనే మ్యాచ్‌ ఫలితం ఆధార పడి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్