Video: 6,4,6,6.. వరుస బౌండరీలతో సొంత టీంమేట్‌కే చుక్కలు చూపించాడు.. వైరల్ వీడియో
స్టార్క్ తన తదుపరి ఓవర్లో తిరిగి కోలుకుంటాడని అనుకున్నారు. కానీ, అతనికి మరో భారీ షాక్ తప్పలేదు. అతను మూడవ ఓవర్ వేయడానికి తిరిగి వచ్చినప్పుడు, మార్ష్ అతనిపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. వరుసగా నాలుగు బౌండరీలు 6, 4, 6, 4 కొట్టాడు. స్టార్క్‌పై మార్ష్ చేసిన పూర్తి విధ్వంసం ఇది DC కి దారుణంగా మారింది.

ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతున్న IPL 2025 మ్యాచ్ ఇద్దరు ఆస్ట్రేలియా స్టార్లు మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్ మధ్య ఉత్కంఠభరితమైన ఘర్షణగా మారింది. ఈ ఇద్దరు సాధారణంగా ఆస్ట్రేలియా తరపున ఆడుతుంటారు. కానీ, మార్చి 24న, ACA–VDCA క్రికెట్ స్టేడియంలో ఇద్దరు ప్రత్యర్ధులగా బరిలోకి దిగారు. మైదానంలో స్నేహం పనికారదని మార్ష్ చేసి చూపించాడు.
మొదటి బంతి నుంచే స్టార్క్‌పై మార్ష్ దూకుడు..
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్ LSG తరపున ఓపెనర్లుగా బ్యాటింగ్ ప్రారంభించారు. మరోవైపు, చేతిలో కొత్త బంతితో, మిచెల్ స్టార్క్ ప్రభావం చూపాలని చూస్తున్నాడు. కానీ, ఆ తర్వాత జరిగినది చూస్తే మాత్రం స్టార్క్‌కు ఓ పీడకల లాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మార్ష్ ఎదుర్కొన్న తొలి బంతికే తన ఉద్దేశ్యాలను చూపించాడు. స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. స్టార్క్ స్టంప్స్‌పై ఫుల్ లెన్త్ బాల్ వేశాడు. దానిని స్వింగ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, మార్ష్ దానిని ముందుగానే అర్థం చేసుకుని లైన్ లోపలికి వెళ్లి ఫ్లిక్ చేశాడు. బంతి 70 మీటర్లు ప్రయాణించి, జరగబోయే దానికి సరైన టోన్‌ను సెట్ చేశాడు.
బీస్ట్ మోడ్‌లోకి వెళ్లిన మిచెల్ మార్ష్..
FIRST-BALL SIX! 🔥
Mitchell Marsh wastes no time as he smashes the first maximum of the match! 👊
Watch LIVE action: https://t.co/mQP5SyTHlW#IPLonJioStar 👉 #DCvLSG | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/cOBkKaCgKz
— Star Sports (@StarSportsIndia) March 24, 2025
స్టార్క్ తన తదుపరి ఓవర్లో తిరిగి కోలుకుంటాడని అనుకున్నారు. కానీ, అతనికి మరో భారీ షాక్ తప్పలేదు. అతను మూడవ ఓవర్ వేయడానికి తిరిగి వచ్చినప్పుడు, మార్ష్ అతనిపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. వరుసగా నాలుగు బౌండరీలు 6, 4, 6, 4 కొట్టాడు. స్టార్క్‌పై మార్ష్ చేసిన పూర్తి విధ్వంసం ఇది DC కి దారుణంగా మారింది.
ఈ కథనం రాసే సమయానికి, లక్నో సూపర్ జెయింట్స్ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..