DC vs LSG: సిక్స్‌లతో శివాలెత్తిన పూరన్.. భారీ రికార్డ్‌తో ఢిల్లీ తాటతీశాడుగా..
Nicholas Pooran Completed 600 Sixes in T20s: ఐపీఎల్ 2025 నాల్గవ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో, అతను 600 సిక్సర్లు పూర్తి చేసిన ఘనతను కూడా సాధించాడు. దీంతో టీ20ల్లో అరుదైన ఘనత సాధించిన 4వ ప్లేయర్‌గా నిలిచాడు.

Nicholas Pooran Completed 600 Sixes in T20s: నికోలస్ పూరన్ తన తుఫాన్ బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. ఈ ఆటగాడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుతాలు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ సోమవారం టీ20 క్రికెట్‌లో పెద్ద మైలురాయిని సాధించాడు. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరిగిన మ్యాచ్‌లో, పురాన్ టీ20 క్రికెట్‌లో 600 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే నాల్గవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
పురాన్ 600+ సిక్స్‌లు..
ఈ మైలురాయిని చేరుకోవడానికి పురాన్‌కు ఒక సిక్స్ అవసరం. ఏడో ఓవర్ మూడో బంతికి విప్రజ్ నిగమ్ వేసిన లాంగ్ సిక్స్ కొట్టడం ద్వారా అతను ఈ ఘనతను సాధించాడు. పురాన్ గేల్, కీరాన్ పొలార్డ్, రస్సెల్ క్లబ్‌లోకి ప్రవేశించాడు. క్రిస్ గేల్ 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లు బాదగా, కీరన్ పొలార్డ్ 695 మ్యాచ్‌ల్లో 908 సిక్సర్లు బాదాడు. రస్సెల్ 539 మ్యాచ్‌ల్లో 733 సిక్సర్లు బాదాడు. 385వ మ్యాచ్‌లో పురాన్ 600 సిక్సర్లు పూర్తి చేశాడు. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ ముందంజలో ఉన్నాడు. అతను 449 మ్యాచ్‌ల్లో 525 సిక్సర్లు కొట్టాడు.
నికోలస్ పూరన్ ఢిల్లీపై ఊచకోత..
6, 6, DROPPED, 6! 💥
A tough start for debutant Vipraj Nigam as he conceded a 25-run over against Pooran & Marsh! 😳
Watch LIVE action: https://t.co/mQP5SyTHlW#IPLonJioStar 👉 #DCvLSG | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/9g3GOI0wVl
— Star Sports (@StarSportsIndia) March 24, 2025
పూరాన్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అతను వచ్చిన వెంటనే, అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఆటగాడు విప్రజ్ నిగమ్ ఓవర్లో 3 సిక్సర్లు కొట్టాడు. తరువాత ట్రిస్టన్ స్టబ్స్ ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు కొట్టాడు. పురాన్ తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 6 ఫోర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 250గా నిలిచింది.
వార్త రాసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్ 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులు, నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 పరుగులు సాధించారు. వారిద్దరి మధ్య 87 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యం ఉంది. డేవిడ్ మిల్లర్ 27 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..