AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul: గుడ్‌న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అతియా శెట్టి..

IPL 2025 మొదటి మ్యాచ్ ఆడటానికి ముందే కేఎల్ రాహుల్ తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టి ముంబైకి తిరిగి వచ్చాడు. అక్కడ అతని భార్య అతియా శెట్టి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా రాహుల్ తన కూతురు పుట్టిన వార్తను పంచుకున్నాడు.

KL Rahul: గుడ్‌న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అతియా శెట్టి..
Kl Rahul Athiya Shetty
Venkata Chari
|

Updated on: Mar 24, 2025 | 9:19 PM

Share

ఐపీఎల్ 2025 ప్రారంభం ఢిల్లీ క్యాపిటల్స్ , టీం ఇండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌కు శుభవార్త తెచ్చిపెట్టింది. రాహుల్, అతని భార్య అతియా శెట్టి ఇంట్లోకి కొత్త సభ్యుడు ప్రవేశించాడు. రాహుల్ భార్య అతియా శెట్టి మార్చి 24, సోమవారం నాడు తమ కుమార్తెకు జన్మనిచ్చింది. రాహుల్, అతియా మొదటిసారి తల్లిదండ్రులు అయిన ఆనందాన్ని పొందారు. రాహుల్, అతియా తమ కుమార్తె పుట్టిన శుభవార్తను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ, దానికి ఒక రోజు ముందే ఇంటికి తిరిగి వచ్చాడు. తన భార్య అతియా ఎప్పుడైనా బిడ్డకు జన్మనివ్వవచ్చని రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి చెప్పడంతో.. ఈ ప్రత్యేక సందర్భంగా కుటుంబంతో కలిసి ఉండటానికి ఫ్రాంచైజీ రాహుల్‌ను అనుమతించిందంట.

మార్చి 24, సోమవారం, ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతున్నప్పుడు, రాహుల్, అతియా తమ కుమార్తె పుట్టిన వార్తను ఫోటోతో పంచుకున్నారు. అయితే, రాహుల్, అతియా తమ కుమార్తె పేరును ఇంకా వెల్లడించలేదు. అభిమానులతో పాటు, క్రికెట్, సినీ ప్రపంచానికి చెందిన ప్రముఖ తారలు కూడా ఈ పోస్ట్‌పై వారిద్దరినీ అభినందించారు. కాగా, రాహుల్, అతియా 2023 లో వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల క్రితమే వారు తల్లిదండ్రులు కాబోతున్నారని వెల్లడించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రెస్టారెంట్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ మహిళకు ఏమైందో
రెస్టారెంట్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ మహిళకు ఏమైందో
రోజూ పాలలో నానబెట్టి పరగడుపున రెండే రెండు తిన్నారనుకోండి.!
రోజూ పాలలో నానబెట్టి పరగడుపున రెండే రెండు తిన్నారనుకోండి.!
రైల్వే వెయిటింగ్ లిస్ట్ సీక్రెట్స్.. ఏ టికెట్ త్వరగా కన్ఫర్మ్..
రైల్వే వెయిటింగ్ లిస్ట్ సీక్రెట్స్.. ఏ టికెట్ త్వరగా కన్ఫర్మ్..
ఇలాంటి దృశ్యం చాలా అరుదు.. 3 పాములు ఒక్కచోట చేరి..
ఇలాంటి దృశ్యం చాలా అరుదు.. 3 పాములు ఒక్కచోట చేరి..
మటన్ లివర్ మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం.!
మటన్ లివర్ మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం.!
తాజ్ మహల్ కంటే రెండింతలు ఖరీదైన సింహాసనం..సంపద, వజ్రాలు, వైభవం
తాజ్ మహల్ కంటే రెండింతలు ఖరీదైన సింహాసనం..సంపద, వజ్రాలు, వైభవం
కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్‌లో పెద్ద పొరపాటు
కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్‌లో పెద్ద పొరపాటు
ట్రైన్ ఇంజిన్ ధర తెలిస్తే షాక్ అవుతారు.!
ట్రైన్ ఇంజిన్ ధర తెలిస్తే షాక్ అవుతారు.!
'పెద్ది'లో శివన్న రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరో తెలుసా?
'పెద్ది'లో శివన్న రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరో తెలుసా?
భారత్ కంటే ముందే చైనా ఎలా సాధించింది “లీక్-ప్రూఫ్” పరీక్ష వ్యవస్థ
భారత్ కంటే ముందే చైనా ఎలా సాధించింది “లీక్-ప్రూఫ్” పరీక్ష వ్యవస్థ