AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 43 ఏళ్ల వయసులోనూ నాటు కొట్టుడు.. 308 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై ఊచకోత.. కేవలం 12 బంతుల్లోనే..

Shahid Afridi: వర్షం కారణంగా 10 ఓవర్లకు బదులు 5 ఓవర్ల మ్యాచ్‌లో న్యూజెర్సీ లెజెండ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన న్యూయార్క్ వారియర్స్ 5 ఓవర్లలో 2 వికెట్లకు 84 పరుగులు చేసింది. అఫ్రిది జట్టు తరపున అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. పరుగుల ఛేదనలో న్యూజెర్సీ లెజెండ్స్ 4.4 ఓవర్లలో 1 వికెట్ తేడాతో విజయం సాధించింది.

Video: 43 ఏళ్ల వయసులోనూ నాటు కొట్టుడు.. 308 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై ఊచకోత.. కేవలం 12 బంతుల్లోనే..
Shahid Afridi
Venkata Chari
|

Updated on: Aug 21, 2023 | 12:04 PM

Share

US Masters T10 League 2023: ప్రస్తుతం యూఎస్ మాస్టర్స్ T10 లీగ్ 2023 జరుగుతోంది. పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మెన్ షాహిద్ అఫ్రిదీతో సహా పలువురు మాజీ వెటరన్ ఆటగాళ్లు లీగ్‌లో ఆడుతున్నారు. టోర్నీలో అఫ్రిది న్యూయార్క్ వారియర్స్‌లో భాగంగా ఉన్నాడు. ఆదివారం (అక్టోబర్ 20), న్యూజెర్సీ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూయార్క్ వారియర్స్‌కు చెందిన ఆఫ్రిది 300 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి లీగ్‌లో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.

న్యూజెర్సీ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూయార్క్ వారియర్స్ తరపున బరిలోకి దిగిన 43 ఏళ్ల షాహిద్ అఫ్రిది 308.33 స్ట్రైక్ రేట్‌తో 12 బంతుల్లో అజేయంగా 37 పరుగులు చేశాడు. అఫ్రిది ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో పాత అఫ్రిది దూకుడు కనిపించింది. అఫ్రిది ఈ ఇన్నింగ్స్ కారణంగా జట్టు మంచి స్కోరు చేయగలిగింది, కానీ, జట్టు విజయం సాధించలేకపోయింది.

ఇవి కూడా చదవండి

షాహిద్ అఫ్రిదీ తుఫాన్ ఇన్నింగ్స్..

అఫ్రిదీ ఇన్నింగ్స్ వీడియోను టీ10 గ్లోబల్ షేర్ చేసింది. అఫ్రిది చాలా దూకుడుగా బ్యాటింగ్ చేయడం వీడియోలో చూడొచ్చు. వీడియోను షేర్ చేస్తూ, “ది లాలా షో. షాహిద్ అఫ్రిది, వావ్!” అంటూ క్యాప్షన్ అందించింది.

అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. ఓడిన ఆఫ్రిది జట్టు..

వర్షం కారణంగా 10 ఓవర్లకు బదులు 5 ఓవర్ల మ్యాచ్‌లో న్యూజెర్సీ లెజెండ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన న్యూయార్క్ వారియర్స్ 5 ఓవర్లలో 2 వికెట్లకు 84 పరుగులు చేసింది. అఫ్రిది జట్టు తరపున అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. పరుగుల ఛేదనలో న్యూజెర్సీ లెజెండ్స్ 4.4 ఓవర్లలో 1 వికెట్ తేడాతో విజయం సాధించింది.

రైదర్ విన్యాసం..

జట్టుకు ఓపెనింగ్‌గా వచ్చిన జెస్సీ రైడర్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. మరోవైపు, సహచర ఓపెనర్ యూసుఫ్ పఠాన్ 6 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన క్రిస్టోఫర్ బార్న్‌వెల్ 10 బంతుల్లో 4 సిక్సర్ల సహాయంతో 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

యూఎస్ మాస్టర్స్ T10 లీగ్ 2023 పాయింట్ల పట్టిక..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..