Video: తొలి ఓవర్ తొలి బంతికే వికెట్.. అరంగేట్రంలోనే రూ.30 లక్షల బౌలర్ హల్చల్.. అసలెవరీ అశ్వని కుమార్?
Ashwani Kumar: సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల అశ్వని కుమార్ అరంగేట్రం చేశాడు. అయితే, మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న అంచనాలను తొలి ఓవర్‌లోనే నిజమని నిరూపించాడు ఈ యంగ్ ప్లేయర్.

Ashwani Kumar: సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల అశ్వని కుమార్ అరంగేట్రం చేశాడు. అయితే, మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న అంచనాలను తొలి ఓవర్‌లోనే నిజమని నిరూపించాడు ఈ యంగ్ ప్లేయర్.
తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ తీసిన అశ్విని..
తన తొలి మ్యాచ్ ఆడుతున్న అశ్విని కుమార్ తన మొదటి బంతికే వికెట్ తీసుకున్నాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చిన అశ్విని కుమార్.. తన తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (11 పరుగులు)ను పెవిలియన్ చేర్చాడు. తిలక్ వర్మ అద్భుత క్యాచ్‌తో అశ్విని కుమార్ తన తొలి ఓవర్ తొలి బంతికే వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
అదే ఓవర్లో వెంకటేష్ అయ్యర్ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకునే అవకాశం వచ్చింది. కానీ, ఈ క్యాచ్‌ను మిచెల్ సాంట్నర్ జారవిడిచాడు. దీంతో మరో అద్భుత రికార్డ్‌ను జస్ట్ మిస్ చేసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో 10వ బౌలర్‌గా..
A dream debut for #AshwaniKumar! 💙
He gets the big wicket of #AjinkyaRahane on the very first delivery of his #TATAIPL career! 🔥
Watch LIVE action ➡ https://t.co/SVxDX5nnhH#IPLonJioStar 👉 #MIvKKR | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 3 &… pic.twitter.com/Qk0cSw6IlE
— Star Sports (@StarSportsIndia) March 31, 2025
అశ్వని ఎడమచేతి వాటం పేసర్, డెత్ ఓవర్లలో (16-20) బౌలింగ్ చేయడంలో అద్భుతంగా రాణిస్తుంటాడు. 2025 మెగా వేలంలో ఫ్రాంచైజీ అశ్విని కుమార్‌ను రూ. 30 లక్షలకు దక్కించుకుంది. అతను గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టులో కూడా ఉన్నాడు. కానీ, ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేదు.
అశ్విని కుమార్ 2022లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున అరంగేట్రం చేశాడు. కానీ, కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 8.50 ఎకానమీతో అతని ఖాతాలో 3 వికెట్లు ఉన్నాయి. అశ్వని పంజాబ్ తరపున 2 ఫస్ట్-క్లాస్, 4 లిస్ట్-ఎ మ్యాచ్‌లు కూడా ఆడాడు.
పంజాబ్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ అయిన షేర్-ఎ-పంజాబ్ టీ20 టోర్నమెంట్‌లో తన ప్రదర్శనతో ఈ ఎడమచేతి వాటం పేసర్ వార్తల్లో నిలిచాడు. BLV బ్లాస్టర్స్ తరపున ఆడుతూ.. 4/36తో అత్యుత్తమ గణాంకాలతో ఆశ్చర్యపరిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..