Sanket Sargar: అధిక బరువుతో నిరాశ.. అన్నం, రోటీ మానేసి, రోజూ 12 గంటల ప్రాక్టీస్.. కట్ చేస్తే.. కామన్వెల్త్‌లో పతకం..

కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన 19 ఏళ్ల సంకేత్ మహదేవ్ సర్గర్ కొల్హాపూర్‌లోని శివాజీ యూనివర్సిటీ విద్యార్థి. అతను జాతీయ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో..

Sanket Sargar: అధిక బరువుతో నిరాశ.. అన్నం, రోటీ మానేసి, రోజూ 12 గంటల ప్రాక్టీస్.. కట్ చేస్తే.. కామన్వెల్త్‌లో పతకం..
Sanket Sargar Silver Medal Cwg 2022
Follow us
Venkata Chari

|

Updated on: Jul 30, 2022 | 4:53 PM

బర్మింగ్‌హామ్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భార‌త‌దేశానికి చెందిన సంకేత్ మ‌హ‌దేవ్ స‌ర్గర్ వెయిట్‌ లిఫ్టింగ్‌లో దేశానికి తొలి పతకాన్ని అందించాడు. పురుషుల 55 కేజీల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బర్మింగ్‌హామ్‌లో భారతదేశం గర్వపడేలా చేయడం 19 ఏళ్ల సంకేత్‌కు అంత సులభం కాలేదు. ఇందుకోసం చాలా కష్టపడ్డాడు. అతను బరువును ఎత్తే ముందు శత్రువుగా మారిన తన బరువును ఓడించాడు. దీంతోనే ఈ విజయం సాధ్యమైంది.

కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన 19 ఏళ్ల సంకేత్ మహదేవ్ సర్గర్ కొల్హాపూర్‌లోని శివాజీ యూనివర్సిటీ విద్యార్థి. అతను జాతీయ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పాల్గొనడానికి గత నెలలో భువనేశ్వర్ చేరుకున్నాడు. అతను బరువు పెరగడం వల్ల ఆ ఆటలలో పాల్గొనడం కష్టంగా మారింది. 55 కిలోల సంకేత్ ల్యాండింగ్ బరువు 1.7 కిలోలు పెరిగింది.

ఇవి కూడా చదవండి

బరువు శత్రువుగా మారడంతో.. రొట్టె, అన్నం వదిలిశాడు..

సంకేత్ మాట్లాడుతూ, “నేను భువనేశ్వర్ చేరుకున్నప్పుడు, నా బరువు 56.7 కిలోలు పెరిగింది. దీంతో నేను రోటీ, అన్నం వంటి కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉండే వాటిని తినడం మానేశాను. నేను ఉడికించిన కూరగాయలు, సలాడ్లు తినడం ప్రారంభించాను. నేను కూడా నీళ్లు తాగడం మానేశాను. సంకేత్ మహదేవ్ సర్గర్ చేసిన కృషి ఫలితంగానే నేడు భారతదేశం పేరు తనంతట తానుగా వెలిగిపోతోంది.

12 గంటల శ్రమకు దక్కిన ఫలితం..

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు రజత పతకాన్ని అందించిన సంకేత్ మహదేవ్ సర్గర్ 13 ఏళ్ల వయస్సులో వెయిట్‌లిఫ్టింగ్ క్రీడను ప్రారంభించాడు. అతని ప్రకారం, ఈ ప్రాంతంలో ఏ ఇతర క్రీడ కూడా ఆడేవారు కాదు. కానీ, అతను ఈ గేమ్‌లో 12 గంటల పాటు సాధన చేసేవాడు. తాజాగా సాధించిన రజత పతకం.. దాని కృషి ఫలితమే.

2024 ఒలింపిక్స్‌ పై కన్ను..

కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్‌హామ్‌లో భారత్‌కు రజతం అందించిన వెయిట్‌లిఫ్టర్ సంకేత్ మహదేవ్ అసలు లక్ష్యం 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతాలు చేయడమేనని అంటున్నాడు. అక్కడ 61 కేజీల విభాగంలో పాల్గొనాలని కోరుకుంటున్నాడు. అతను మాట్లాడుతూ, “నా దృష్టి 2024 ఒలింపిక్స్‌పై ఉంది. అక్కడ నేను 61 కేజీల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అందుకోసం నేను కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు.