Chiranjeevi: పారిస్ ఒలంపిక్స్‌లో భారత ఆటగాళ్ల కోసం బ్యాగు నిండా ఫుడ్ ప్యాకెట్లు.. సురేఖమ్మను మెచ్చుకోవాల్సిందే

ఒలంపిక్స్ క్రీడలను ప్రత్యక్షంగా చూసేందుకు వివిధ రంగాల ప్రముఖులు పారిస్ కు వెళ్లారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా ఉంది. చిరంజీవితో పాటు రామ్ చరణ్, సురేఖ, ఉపాసన.. నలుగురూ కలిసి పారిస్ ఒలంపిక్స్ విలేజ్ లో సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే పారిస్ ఒలంపిక్స్ లో ఆటగాళ్లు ఉండే చోట ఇండియన్ ఫుడ్ దొరకడం లేదట. హోటల్స్, రెస్టారెంట్స్ కూడా లేవట

Chiranjeevi: పారిస్ ఒలంపిక్స్‌లో భారత ఆటగాళ్ల కోసం బ్యాగు నిండా ఫుడ్ ప్యాకెట్లు.. సురేఖమ్మను మెచ్చుకోవాల్సిందే
Chiranjeevi Family
Follow us
Basha Shek

|

Updated on: Jul 30, 2024 | 9:27 PM

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఒలంపిక్స్ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. పతకాలు గెలిచేందుకు భారత ఆటగాళ్లు కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇప్పటికే మనూ భాకర్ షూటింగ్ లో కాంస్య పతకం గెల్చుకుని భారత పతకాల పట్టిక తెరిచింది. ఇక తెలుగమ్మాయిలు సింధు, నిఖత్ జరీన్ లు కూడా తర్వాతి రౌండ్లకు దూసుకెళ్లారు. కాగా ఒలంపిక్స్ క్రీడలను ప్రత్యక్షంగా చూసేందుకు వివిధ రంగాల ప్రముఖులు పారిస్ కు వెళ్లారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా ఉంది. చిరంజీవితో పాటు రామ్ చరణ్, సురేఖ, ఉపాసన.. నలుగురూ కలిసి పారిస్ ఒలంపిక్స్ విలేజ్ లో సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే పారిస్ ఒలంపిక్స్ లో ఆటగాళ్లు ఉండే చోట ఇండియన్ ఫుడ్ దొరకడం లేదట. హోటల్స్, రెస్టారెంట్స్ కూడా లేవట. స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ విషయం చెబుతుండగా మెగా కోడలు సతీమణి వీడియో తీసి తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. అదే సమయంలో భారత క్రీడాకారుల కోసం తమ అత్తమ్మాస్ కిచెన్ నుంచి తీసుకొచ్చిన ఇన్‌స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్ ను చూపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసన కలిసి ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరిట ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇందులో భారతీయ సంప్రదాయ వంటకాలతో పాటు ఇన్‌స్టంట్ ఫుడ్స్, పచ్చడ్లు, పొడులు.. ఇలా పలు ఐటమ్స్ తయారు చేసి అమ్ముతున్నారు. పారిస్ పర్యటన నేపథ్యంలో బోలెడన్ని ఉప్మా, పులిహార, పచ్చడ్లు.. ఇలా రకరకాల ఇన్‌స్టంట్ ఫుడ్స్ ప్యాకెట్స్ బ్యాగ్ నిండా తీసుకెళ్లారు మెగా ఫ్యామిలీ. ఈ ఫుడ్ ప్యాకెట్లను ఒలంపిక్స్ లో సత్తా చాటేందుకు సిద్ధమైన భారత ఆటగాళ్లకు ఇవ్వనున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. దీనితో మెగా ఫ్యామిలీ మరోసారి అందరి మనసులు గెల్చుకుందని అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పారిస్ లో మెగా ఫ్యామిలీ..

రామ్ చరణ్, సింధుల ముచ్చట్లు.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.