AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగమ్మాయిల సత్తా: ప్రత్యూషకు సీఎం ప్రశంసలు..

ఆమె ఏడేళ్లకే చదరంగంలో పతకం సాధించింది. గుర్తింపుతో సమానంగా వచ్చిన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఛాంపియన్‌గా నిలిచింది. ఇటీవలే మరో ఘనత సాధించిన ప్రత్యూష.

తెలుగమ్మాయిల సత్తా: ప్రత్యూషకు సీఎం ప్రశంసలు..
Jyothi Gadda
|

Updated on: Feb 29, 2020 | 8:53 AM

Share

ఆమె ఏడేళ్లకే చదరంగంలో పతకం సాధించింది. గుర్తింపుతో సమానంగా వచ్చిన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఛాంపియన్‌గా నిలిచింది. ఇటీవలే ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌‌‌ని కూడా అందుకుంది. ఆ హోదా అందుకున్న మూడో తొలుగమ్మాయిగా గుర్తింపు పొందింది. ఆమే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తెలుగు చెస్ క్రీడాకారిణి, మహిళా గ్రాండ్ మాస్టర్ బొడ్డా ప్రత్యూష. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ప్రత్యూషను ముఖ్యమంత్రి అభినందించారు.

ప్రపంచ వేదికలపై తెలుగమ్మాయిలు ఎనలేని సత్తా చాటుతున్నారని ప్రశంసించారు. రాబోయే కాలంలో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరారు. ప్రభుత్వం తరపున సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రత్యూష వెంట ఆమె తల్లిదండ్రులు కూడా సీఎంను కలుసుకున్న సమయంలో ఉన్నారు. భారత్‌లో ఈ హోదా ఉన్న ఎనిమిదో క్రీడాకారిణి ప్రత్యూష. ఇప్పటిదాకా ఎనిమిది జాతీయ, 24 అంతర్జాతీయ పతకాలు గెలిచింది ప్రత్యూష.

బొడ్డా ప్రత్యూష 2020 ఏడాది ఫిబ్రవరి లోనే మహిళా గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ సాధించింది. ఇంగ్లాండ్‌లో జరిగిన జిబ్రాల్టర్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్ లో ప్రత్యూషకు మూడో మహిళా గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌ లభించింది. మూడేళ్ల క్రితం తొలి రెండు నార్మ్‌లు సాధించిన ప్రత్యూష.. ఇటీవల జిబ్రాల్టర్‌ టోర్నీలో మూడో నార్మ్‌ అందుకోవడం ద్వారా ఈ హోదా సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మాత్రమే ఇప్పటివరకు మహిళా గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ సాధించారు.

మీ ఇంట్లో ఏనుగు బొమ్మ ఉందా..? ఇలా చేస్తే మీకు రెట్టింపు అదృష్టం.!
మీ ఇంట్లో ఏనుగు బొమ్మ ఉందా..? ఇలా చేస్తే మీకు రెట్టింపు అదృష్టం.!
సింగరేణి గడ్డపై కాంగ్రెస్ హవా.. రామగుండం కార్పొరేషన్‌లో ఘన విజయం
సింగరేణి గడ్డపై కాంగ్రెస్ హవా.. రామగుండం కార్పొరేషన్‌లో ఘన విజయం
స్కూల్ కైనా ఆఫీస్ కైనా ఈ రైస్ పంపిస్తే బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే
స్కూల్ కైనా ఆఫీస్ కైనా ఈ రైస్ పంపిస్తే బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే
శ్రీకాళహస్తిలోనూ గిరి ప్రదక్షిణ.. భక్తులకు పవన్ కళ్యాణ్ తీపికబురు
శ్రీకాళహస్తిలోనూ గిరి ప్రదక్షిణ.. భక్తులకు పవన్ కళ్యాణ్ తీపికబురు
ఐఫోన్ ధరకే లగ్జరీ కార్లు.. అద్దిరిపోయే ఫీచర్లు.. ఎక్కడో కాదు..
ఐఫోన్ ధరకే లగ్జరీ కార్లు.. అద్దిరిపోయే ఫీచర్లు.. ఎక్కడో కాదు..
ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన 'బ్లెస్సింగ్'.. కట్‌చేస్తే..
ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన 'బ్లెస్సింగ్'.. కట్‌చేస్తే..
మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..?
మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..?
పెయింట్ పాడవకుండా క్రేయాన్స్, మార్కర్ మరకలు మాయం
పెయింట్ పాడవకుండా క్రేయాన్స్, మార్కర్ మరకలు మాయం
కాంగ్రెస్ హవా ..చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి సెన్సేషన్
కాంగ్రెస్ హవా ..చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి సెన్సేషన్
నాతో సౌందర్య స్పెషల్ సాంగ్.. ఆ సినిమా ఏకంగా 365 రోజులు ఆడింది..
నాతో సౌందర్య స్పెషల్ సాంగ్.. ఆ సినిమా ఏకంగా 365 రోజులు ఆడింది..