AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 ఏళ్ల క్రితం ప్రపంచానికి పరిచమైన కింగ్.. తొలి మ్యాచ్‌లో స్కోర్, మ్యాచ్ రిజల్ట్ ఏంటంటే?

Virat Kohli Debut: 2008 ఆగస్టు 18న శ్రీలంకతో మ్యాచ్‌లో 12 పరుగులకే వెనుదిరిగిన విరాట్ కోహ్లీ.. అదే ఆటగాడు నేడు అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేలకుపైగా పరుగులు చేసిన దిగ్గజంగా నిలిచాడు. ఆ చిన్న ఆరంభం నుంచి ఎన్నో రికార్డులు, విజయాలు, మైలురాళ్లు ఎలా వచ్చాయో చూస్తే ప్రయాణం ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది.

18 ఏళ్ల క్రితం ప్రపంచానికి పరిచమైన కింగ్.. తొలి మ్యాచ్‌లో స్కోర్, మ్యాచ్ రిజల్ట్ ఏంటంటే?
Virat Kohli International Debut
Venkata Chari
|

Updated on: Aug 18, 2026 | 6:29 PM

Share

Virat Kohli Debut: విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌కు 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేలో 19 ఏళ్ల కోహ్లీ భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అప్పటికి కింగ్ కోహ్లీ భారత అండర్-19 జట్టుకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా పేరుగాంచాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ 22 బంతుల్లో 12 పరుగులు చేశాడు. నువాన్ కులశేఖర బౌలింగ్‌లో ఎనిమిదో ఓవర్‌లో ఔటయ్యాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 146 పరుగులకు ఆలౌటై, శ్రీలంక చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఆ తొలి మ్యాచ్ స్కోరు చూస్తే కోహ్లీ భవిష్యత్తును ఊహించడం కష్టమే. ఢిల్లీ దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చిన ఈ యువ బ్యాటర్ కొద్దికాలానికే భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తర్వాత మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడు.

ఎక్కువమంది చదివినది: వైభవ్ సూర్యవంశీ కంటే నేనే తోపు అన్నాడు.. కట్‌చేస్తే.. మైదానంలోనే పరువు పోగొట్టుకున్నాడుగా..!

ఇవి కూడా చదవండి

రికార్డుల వేటలో మరో స్థాయి..

కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో 28,000కుపైగా పరుగులు, 85 శతకాలు సాధించాడు. శతకాల విషయంలో సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 2010 నుంచి 2019 మధ్య 20,960 అంతర్జాతీయ పరుగులు చేయడం ఒక దశాబ్దంలో ఏ ఆటగాడికీ సాధ్యం కాని గణాంకంగా నిలిచింది.

2018లో కోహ్లీ అత్యున్నత స్థాయిని అందుకున్నాడు. ఆ ఏడాది 37 మ్యాచ్‌ల్లో 2,735 పరుగులు, 11 శతకాలు సాధించాడు. అదే సమయంలో ఒకే ఐసీసీ అవార్డుల ఎడిషన్‌లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

పెద్ద వేదికలపై కోహ్లీ ముద్ర..

ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో కోహ్లీ 3,854 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో 1,292 పరుగులు చేసి టోర్నీ చరిత్రలో అగ్రస్థానంలో నిలిచాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా చేసిన ఏడు డబుల్ సెంచరీలు తన పేరుతో లిఖించుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్‌.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..!

ఐపీఎల్‌లోనూ అతని నిలకడ ప్రత్యేకమే. తొమ్మిది సీజన్లలో 500కుపైగా పరుగులు, 2023 నుంచి 2026 వరకు వరుసగా నాలుగు సీజన్లలో 600కుపైగా పరుగులు సాధించాడు. 2008లో 12 పరుగులతో మొదలైన కోహ్లీ కథ.. ఇప్పుడు భారత క్రికెట్ చరిత్రలో చెరగని అధ్యాయంగా మారింది.

దంబుల్లాలో ఆడిన తొలి వన్డే నుంచి 18 ఏళ్లలో విరాట్ కోహ్లీ ఎన్నో మైలురాళ్లను దాటాడు. 12 పరుగులతో మొదలైన ఆ ప్రయాణం 28 వేలకుపైగా అంతర్జాతీయ పరుగులు, 85 శతకాల స్థాయికి చేరడం అతని నిలకడకు నిదర్శనం.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us