AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన పీవీ సింధు.. రేపు హైదరాబాద్ లో రిసెప్షన్ వేడుక

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తన ర్యాకెట్ తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించి ఎన్నో చారిత్రక విజయాలను సొంతం చేసుకుని దేశ ప్రతిష్టను ఇనుమడింప జేసేలా జాతీయ జెండాను ఎగురవేసిన పీ సింధు వివాహిక జీవిత్మలోకి అడుగు పెట్టింది. రాజస్థాన్‌లో పివి.సింధు, పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్తసాయిల పెట్టి సాంప్రదాయం పద్దతిలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ నవ దంపతులకు ప్రముఖులు , అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన పీవీ సింధు.. రేపు హైదరాబాద్ లో రిసెప్షన్ వేడుక
Player Pv Sindhu Marriage
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 23, 2024 | 3:42 PM

Share

రాజస్థాన్‌లోని ఉదయ్‌ సాగర్‌ సరస్సులో రఫల్స్‌ హోటల్‌లో భారత బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు, పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయిల పెళ్లి వైభవంగా జరిగింది. డిసెంబర్ 22వ తేదీ.. ఆదివారం రాత్రి 11 గంట‌ల 20 నిమిషాల‌కు సింధు, సాయిలు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఉదయ సాగర్ లోని దీవిలో సింధు, సాయిల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహం తెలుగు సంప్రదాయంలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సుమారు 140 మంది అతిధులు హాజరైనట్లు తెలుస్తోంది. తెలుగు హిందూ ఆచారాలను అనుసరిస్తూ శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ పెళ్లి వేడుకలో సింధు పెళ్లి కూతురుగా ఎంతో అందంగా దేవత భూమీ మీదకు దిగి వచ్చినట్లు కనిపించింది. ఈ నవ దంపతులకు సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఉదయ్‌సాగర్‌ సరస్సులోని 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక దీవిలో అట్టహాసంగా జరిగిన సింధు సాయి పెళ్లి వేడుక తెలుగుదనం ఉట్టిపడుతూనే.. రాజస్థాన్‌ రాచరిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంది. సింధు సాయిల పెళ్లి కోసం ఆరావళి పర్వతాల మధ్య ఉన్న ప్రత్యేక స్థలంలో రఫల్స్‌ సంస్థ రాజప్రసాదాన్ని తలపించేలా భవంతులతో ఉన్న రిసార్ట్‌ను ఏర్పాటు చేసింది. విహానికి హరజరైన అతిధులను ఒక ప్రత్యెక పడవలో పెళ్లి వేడుక వద్దకు తీసుకుని వెళ్లారు. ఈ రిసార్ట్ లోని సాధారణ రూమ్ రెంట్ సుమారు లక్ష వరకూ ఉంటుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సింధు పెళ్లి కోసం వచ్చిన అతిధులకు సుమారు 100 గదులను బుక్‌ చేసింది. అంతేకాదు వివాహానికి హాజరైన అతిధులకు స్పెషల్ ప్లైట్ టికెట్స్ ను కూడా అందించినట్లు సమాచారం. కాగా ఈ పెళ్లి వేడుకలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు చాముండేశ్వర్‌నాథ్‌, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, ప్రముఖ వైద్యుడు గురువారెడ్డి సహా పలువురు హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు.

డిసెంబర్ 24వ తేదీ(మంగళవారం) రాత్రి హైదరాబాద్ లో సింధు, సాయిల వివాహ రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కు రాజకీయ సినీ, క్రీడా ప్రముఖులు హజరు కానున్నట్లు తెలుస్తోంది. పీవీ సింధు స్వయంగా ప్రముఖులను తన పెళ్ళికి ఆహ్వానిస్తూ వివాహ పత్రికలను అందజేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..