ధోనీ కోసం బ్రావో ‘హెలికాప్టర్’ సాంగ్..టీజర్ అదరహో…
ధోని బర్త్ డే దగ్గరపడుతోంది. సోషల్ మీడియాలో అభిమానుల కోలాహలం మాములుగా లేదు. జులై 7న మహీ బర్త్ డే కోసం అతడి ఫ్యాన్స్ మాత్రమే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా ఎదురుచూస్తున్నారు.
ధోని బర్త్ డే దగ్గరపడుతోంది. సోషల్ మీడియాలో అభిమానుల కోలాహలం మాములుగా లేదు. జులై 7న మహీ బర్త్ డే కోసం అతడి ఫ్యాన్స్ మాత్రమే కాదు పలవురు సెలబ్రిటీలు కూడా ఎదురుచూస్తున్నారు. మరి ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది మరి. ఇక ఇండియన్ ప్రీమియర్‌లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడుసార్లు టైటిల్ ముద్దాడేలా చేశాడు తలా. అతడు 39వ పడిలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో అప్పుడే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాడు. అతడికి ధోనీ అంటే చాలా ఇష్టం. వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. చెన్నై సూపర్‌కింగ్స్ ఇద్దరూ కలిసి పలు మ్యాజికల్ ఇన్నింగ్స్ ఆడారు. ఈ పుట్టిన రోజుకు ‘హెలికాప్టర్’ పాటను ధోనీకి బ్రావో అంకితమివ్వబోతున్నాడట. బ్రావో అద్భుతమైన సింగర్ కూడా అని చాలామందికి తెలిసిన విషయమే. డ్యాన్స్ కూడా బానే చేస్తాడు. తానే స్వయంగా పాటలు రాసి వీడియోలు రూపొందిస్తాడు. అతడు రూపొందించిన ‘డీజే.. ఛాంపియన్’ పాట ఎన్నో రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ‘హెలికాప్టర్’ పాట టీజర్‌ను రిలీజ్ చేశాడు బ్రావో. దానిపై మీరూ ఓ లుక్కేయండి.