AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ఓర్నీ.. వీళ్ల ధైర్యం తగలెయ్యా.. ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!

Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన ప్రముఖ వన్8 బ్రాండ్ పేరుతో జరుగుతున్న భారీ నకిలీ దందాను ఆగ్రా పోలీసులు రట్టు చేశారు. రహస్య సమాచారంతో మెరుపు దాడులు చేసిన అధికారులు, రూ.లక్షల విలువైన నకిలీ షూస్‌తో పాటు ముడి సరుకును స్వాధీనం చేసుకుని నిర్వాహకులకు గట్టి షాక్ ఇచ్చారు.

Virat Kohli: ఓర్నీ.. వీళ్ల ధైర్యం తగలెయ్యా.. ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!
Virat Kohli (1)
Rakesh
|

Updated on: Aug 20, 2026 | 11:28 AM

Share

Virat Kohli: చారిత్రక నగరం ఆగ్రా వేదికగా ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు ఇటీవల తరచుగా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి చెందిన వన్8 బ్రాండ్ పేరిట షూస్ తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఒక తయారీ కేంద్రంపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో క్వాలిటీ లేని వస్తువులతో తయారు చేసిన వేల సంఖ్యలోని నకిలీ బూట్లు బయటపడ్డాయి. ఒరిజినల్ బ్రాండ్ ఉత్పత్తులను తలదన్నేలా లోగోలు, డిజైన్లను కాపీ చేసి మార్కెట్లోకి వదులుతున్న తీరు అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది.

దేశవ్యాప్తంగా సరఫరా నెట్‌వర్క్

పోలీసులు స్వాధీనం చేసుకున్న సరుకు పరిమాణాన్ని బట్టి ఈ నకిలీ తయారీ నెట్‌వర్క్ ఎంత విస్తృతంగా ఉందో అర్థమవుతోంది. తయారైన నకిలీ బూట్లను కేవలం స్థానిక మార్కెట్లకే కాకుండా, దేశంలోని వివిధ ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నకిలీ ఉత్పత్తులను ఏ ఏ ప్రాంతాలకు పంపించారు, ఏ ఏ డీలర్లు ఈ దందాలో భాగస్వాములుగా ఉన్నారనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ ధరకు విక్రయిస్తూ సామాన్య వినియోగదారులను మోసం చేస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి:Unwanted Records: టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు.. తొలి ఓవర్ తొలి బంతికే అవుటైన ముగ్గురు స్టార్ బ్యాటర్లు

సోషల్ మీడియాలో వైరల్

ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ వన్8 బ్రాండ్ కాపీల గురించిన సమాచారం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. బ్రాండ్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ తయారీ కేంద్రం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను, డిస్ట్రిబ్యూటర్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నకిలీ ఉత్పత్తుల తయారీ నిరోధక చట్టాల కింద కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఇది కూడా చదవండి: Saaniya Chandhok: సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా? ఏం చేసిందో తెలిస్తే వావ్ అంటారు

వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ప్రముఖ బ్రాండ్ల పేర్లతో తక్కువ ధరకు లభించే నకిలీ ఉత్పత్తుల పట్ల వినియోగదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. విరాట్ కోహ్లీ లాంటి అంతర్జాతీయ క్రీడాకారుల బ్రాండ్ ఇమేజ్‌ను వాడుకుని సొమ్ము చేసుకుంటున్న ఇలాంటి నకిలీ రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో దర్యాప్తు వేగవంతం చేసి, ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: SL vs IND 2nd Test: ఆ రూల్ ఎఫెక్ట్.. 2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..!

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర