యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన ఉత్సవ కమిటీ
స్వయంభూ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Yadadri brahmotsavams : స్వయంభూ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైష్ణవ సంప్రదాయం ప్రకారం అర్చకులు, వేదపండితులు ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం నుంచి ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈనెల 25వ తేదీ వరకూ పదకొండు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. యాదాద్రి స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ, ప్రభుత్వ విప్, స్ధానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ ఈవో గీతారెడ్డి, అర్చకులు తదితరులు ఉన్నారు.

Yadadri brahmotsavams invitation to cm KCR
మరోవైపు, ప్రధానాలయ పునర్మిర్మాణం పనులు కొనసాగుతున్న దృష్ట్యా ఈ ఏడాది కూడా ఉత్సవాలను బాలాలయంలోనే చేపట్టారు. ఉదయం విశ్వక్సేనుడి ఆరాధన, స్వస్తి వచనంతో పాటు సాయంత్రం మృత్సగ్రహణం, అంకురార్పణ పర్వాలను నిర్వహించారు. ఈ వేడుకలతో స్వామివారి ఆలయ ఉత్సవాలు మొదలైనట్లు ప్రధానార్చకులు వెల్లడించారు. పదకొండు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో తొలుత గర్భాలయంలోని మూలవర్యులకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించినట్లు చెప్పారు.
Read Also… Turmeric Board: తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు.. పసుపు బోర్డు పెట్టే ఆలోచన లేదన్న కేంద్రం
