Vrat Rituals: వ్రతం చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూదడు.. ఈ నియమం వెనుక అసలు కారణమిదే..!
ప్రతి ఆచారానికి కొన్ని నియమాలు, విధానాలు ఉంటాయి. అదే విధంగా వ్రతాలకు కూడా కొన్ని నియమాలను పాటిస్తుంటారు హిందువులు. ఈ నేపథ్యంలోనే వ్రత సమయంలో మితంగా మాత్రమే భోజనం చేస్తుంటారు హిందువులు. ఇంకా ఉల్లిపాయ లేదా వెల్లుల్లిని తమ ఆహారం నుంచి నిషేధిస్తారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. పండితుల ప్రకారం పూజలు చేసే సమయంలో సాత్విక భోజనం మాత్రమే తినాలి. ఇంకా ఈ ఉల్లి, వెల్లుల్లి లేదా ఇతర మసాలాలతో కూడిన భోజనం రాజసిక ఆహార పరిధిలోకి
భారతదేశం అంటేనే వివిధ రకాల సంస్కతీసాంప్రదాయాల పుట్టినిల్లు. యుగయుగాలుగా సనాతన ధర్మంలో విలసిల్లుతున్న ఈ దేశంలోని ఏ ఊరుకి వెళ్లినా నిష్టనియమాలతో పూజలు చేసేవారు దర్శనమిస్తారు. ఇంకా వారు ఎన్నో ఉపవాసాలు, వ్రతాలు, ఆచారాలు పాటిస్తుంటారు. ప్రతి ఆచారానికి కొన్ని నియమాలు, విధానాలు ఉంటాయి. అదే విధంగా వ్రతాలకు కూడా కొన్ని నియమాలను పాటిస్తుంటారు హిందువులు. ఈ నేపథ్యంలోనే వ్రత సమయంలో మితంగా మాత్రమే భోజనం చేస్తుంటారు హిందువులు. ఇంకా ఉల్లిపాయ లేదా వెల్లుల్లిని తమ ఆహారం నుంచి నిషేధిస్తారు. అందుకు కారణం కూడా లేకపోలేదు.
పండితుల ప్రకారం పూజలు చేసే సమయంలో సాత్విక భోజనం మాత్రమే తినాలి. ఇంకా ఈ ఉల్లి, వెల్లుల్లి లేదా ఇతర మసాలాలతో కూడిన భోజనం రాజసిక ఆహార పరిధిలోకి వస్తుంది. తీసుకునే ఆహారం మన గుణాలను కూడా ప్రభావితం చేస్తుందనే నమ్మకం ఉన్నందును రాజసికానికి చెందిన మసాలాలను ఉపవాస సమయంలో తీసుకోకుండా నియమం పాటిస్తారు. సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా భగవంతుడిని పూజించే సమయంలో శాంతంగా ఉంటామన్న ఉద్దేశ్యంలో కూడా పెద్దలు ఈ విధమైన నియమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.