Amla Facts: ఆదివారం వద్దు.. రాత్రిళ్లు అసలే వద్దు.. ఉసిరికాయను ఇలా తింటే అలక్ష్మీ దోషం!
పూర్వకాలం ఇళ్లలో పెద్దవారు భోజన సమయంలో ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అని చెప్పేవారు. ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనేవారు. ఆ రోజు ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చేవారు కాదు. వారికి కూడా వివరం తెలియకపోయినా సరే తమ తల్లిదండ్రుల నుంచీ వస్తున్న నియమాలను పాటించేవారు. అయితే ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదు, రాత్రిపూట ఎందుకు తినకూడదు అనే సందేహం మాత్రం చాలామందిలో ఉంది. ఈ నియమంలో దాగి ఉన్న ఆరోగ్య, ఆధ్యాత్మిక అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

శతాబ్దాలుగా వస్తున్న నియమం ప్రకారం ఆదివారం, రాత్రి సమయంలో ఉసిరికాయ తినడం నిషేధం. దీని వెనుక సైన్స్ తో కూడిన ఆరోగ్య రహస్యాలు, శాస్త్ర ప్రమాణాలు దాగి ఉన్నాయి. పూర్వకాలం మన పెద్దలు ఆదివారం రోజున, రాత్రి సమయంలో ఉసిరికాయ తినకూడదని చెప్పేవారు. వారికి వివరం తెలియకపోయినా తమ పెద్దల నుంచి వస్తున్న నియమాలను పాటించారు. ఈ నిషేధ నియమంలో దాగి ఉన్న కారణాలు ఇక్కడ చూడండి.
సైన్స్ పరంగా కారణాలు
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉండే శక్తి కారణంగా ఈ నియమాన్ని పాటించాలి:
- అజీర్తి సమస్యలు: ఉసిరికాయ ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది. రాత్రి సమయంలో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది.
- నిద్రలేమి: ఉసిరి శరీరానికి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది. రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము. అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు.
- సూర్య శక్తి: ఉసిరికాయకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది. సూర్యుడికి రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది. ఆ శక్తి ప్రభావం వల్లనే ఆదివారం నాడు ఉసిరిని దూరం పెడుతారు.
శాస్త్ర ప్రమాణం
ఈ నియమానికి శాస్త్రపరమైన ఆధారం కూడా ఉంది. పురాణాలలో ఈ అంశాన్ని ఒక శ్లోక రూపంలో తెలిపారు:
శ్లోకం: భా నువారేదివారాత్రం సప్తమ్యాంచతథాదివా , ధాత్రీఫలంనరస్స్యా ద్యహ్యలక్ష్మీకోభవేత్సదా. వీర్యహానిర్యశోహానిః ప్రజ్ఞాహానిస్తథైవచ. భవేద్యస్మాత్తతోరాత్రౌ ధాత్రీంయత్నేనవర్జయేత్.
అర్థం: ఆదివారం నాడు రాత్రింబగళ్ళు, సప్తమి నాడు పగటిపూట ఉసిరిక పచ్చడి తిన్నచో అలక్ష్మీ దోషం కనుక నిషేధము. నిషిద్ధ దినాలలో ఉసిరిక తింటే:
- వీర్యహాని
- యశోహాని (కీర్తి నష్టం)
- ప్రజ్ఞాహాని (తెలివితేటల క్షీణత) కూడా కలుగుతాయని ఈ శ్లోకం చెబుతోంది. అందుకే రాత్రి సమయంలో ఉసిరిని ప్రయత్నపూర్వకంగా తినడం మానాలి.
గమనిక: ఈ వివరాలు సాంప్రదాయ విశ్వాసాలు, శాస్త్ర ప్రమాణాల ఆధారంగా అందించాము. ఆరోగ్య సమస్యలు, ఆహార నియమాల కోసం వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.




