- Telugu News Spiritual When you wake up in the morning you should not see these things at all, check here is details
Vastu Tips: ఉదయం లేవగానే వీటిని అస్సలు చూడకూడదట..
ఉదయం లేవగానే ఎనర్జిటిక్‌గా ఉంటేనే.. మన రోజంతా బాగుంటుంది. మన పనులను కూడా చకచకా చేసుకోగలం. ఉదయం నీరసంగా ఉంటే రోజంతా డల్‌గానే ఉంటాం. ఎలాంటి పనులు చేసుకోలేం. అంతా గందరగోళంగా ఉంటుంది. ఏదీ సరిగ్గా చేయలేదు. ఒక్కోసారి అనుకోని సమస్యలు కూడా ఎదురవుతాయి. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం లేవగానే కొన్ని రకాల వస్తువులను అస్సలు చూడకూడదు. అలా చూడటం వల్ల కొన్ని అశుభ ఫలితాలు ఎదురవుతాయని, నెగిటివ్ ఎనర్జీ నెలకొంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు..
Updated on: Jul 07, 2024 | 6:08 PM

ఉదయం లేవగానే ఎనర్జిటిక్‌గా ఉంటేనే.. మన రోజంతా బాగుంటుంది. మన పనులను కూడా చకచకా చేసుకోగలం. ఉదయం నీరసంగా ఉంటే రోజంతా డల్‌గానే ఉంటాం. ఎలాంటి పనులు చేసుకోలేం. అంతా గందరగోళంగా ఉంటుంది. ఏదీ సరిగ్గా చేయలేదు. ఒక్కోసారి అనుకోని సమస్యలు కూడా ఎదురవుతాయి.

అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం లేవగానే కొన్ని రకాల వస్తువులను అస్సలు చూడకూడదు. అలా చూడటం వల్ల కొన్ని అశుభ ఫలితాలు ఎదురవుతాయని, నెగిటివ్ ఎనర్జీ నెలకొంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఉదయం లేవగానే చూడకూడని వస్తువుల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం లేవగానే మీ నీడను లేదా వేరే వాళ్ల నీడలను అస్సలు చూడకూడదట. దీని వల్ల అంతా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే నీడలను మాత్రం అస్సలు చూడకూడదు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేచాక వంటింట్లో ఉన్న మురికి పాత్రలను చూడకూడదు. ఇలా చూడటం వల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందట. మిమ్మల్ని పేదరికంలో పడేస్తుందని అంటారు. అందుకే ఎప్పటికప్పుడు వంట పాత్రలను శుభ్రం చేసుకోవాలి.

ఉదయం లేవగానే అద్దాన్ని చూడకూడదు. అద్దంలో మీ ముఖం అస్సలు చూసుకోకూడదు. ఇలా చూడటం వల్ల మీలో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంది. దీంతో మీరు ఉత్సాహంగా అస్సలు ఉండలేరు. ఉదయం లేచాక ముఖం కడుక్కుని మాత్రమే అద్దంలో చూసుకోవాలి.




