Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala Makaravilakku: శబరిమలలో మకరవిళక్కు ఎందుకు జరుపుకొంటారు? దీని వెనకున్న పురాణ గాథ ఏంటి?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అరుదైన ఘట్టం. అయ్యప్ప స్వాములకు అపురూప దృశ్యం. అదే మకరజ్యోతి దర్శనం. మరికొద్ది నిమిషాల్లో శబరిమలలో మకరజ్యోతి కనువిందు..

Sabarimala Makaravilakku: శబరిమలలో మకరవిళక్కు ఎందుకు జరుపుకొంటారు? దీని వెనకున్న పురాణ గాథ ఏంటి?
Sabarimala Makaravilakku
Follow us
Subhash Goud

|

Updated on: Jan 14, 2023 | 5:47 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అరుదైన ఘట్టం. అయ్యప్ప స్వాములకు అపురూప దృశ్యం. అదే మకరజ్యోతి దర్శనం. మరికొద్ది నిమిషాల్లో శబరిమలలో మకరజ్యోతి కనువిందు చేయనుంది. ఇప్పటికే చేరుకున్న లక్షలాది మంది అయ్యప్పస్వాముల నినాదాలతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. శబరిమలలో మరికొద్ది సేపట్లో మకరజ్యోతి కనిపించబోతుంది.

స్వామియే శరణమయ్యప్ప.. జ్యోతి స్వరూపమే శరణమయ్యప్ప.. ఇదీ భక్త జనులు మకర జ్యోతి రోజున శబరిమలపై చేసే శరణుఘోష. ఇంతకీ శబరిమలలో మకరవిళక్కు ఎందుకు చేసుకుంటారు? దీని వెనకున్న పురాణ గాథ ఏంటి? అని చూస్తే.. రామలక్ష్మణులు.. శబరిమలలో భక్త శబరిని కలుస్తారట. ఆమె పెట్టే పండ్లను రుచి చూస్తారట. అక్కడ తపస్సు చేస్తున్న ఓ దివ్య శక్తిని చూస్తాడట శ్రీరాముడు. అతడెవరని శబరిని అడుగుతాడట. అతడు శాస్తాగా చెబుతుంది భక్త శబరి. అంతలో రాముడు శాస్తా వైపు నడుస్తాడట. శాస్తా రామునికి స్వాగతం పలికేందుకు లేచి నిలబడతాడట. ఈ అపురూప సన్నివేశానికి సంబంధించిన వార్షికోత్సవాన్ని మకర విళక్కు రోజున జరుపుకుంటారట. మకర విళక్కు రోజున ధర్మశాస్తా.. భక్తులను ఆశీర్వదించడానికి తన తపస్పుకు విరామం ఇస్తాడని.. నమ్ముతారు స్వామిభక్తులు.

స్వామి దీక్ష విరమించి ఎంతో విశ్రాంతిగా ఉన్న సమయంలో తమ మొర ఆలకిస్తాడనీ.. తమను కాపాడమంటూ భక్తులు చేసే ఆ శరణుఘోష విని.. పేరు పేరునా.. వారి కోర్కెలు నెరవేర్చుతాడనీ విశ్వసిస్తారు భక్త జనులు. అయ్యప్ప అనగానే చూసి తీరాల్సిన మహా మహోత్సవం మకరజ్యోతి దర్శనమే. ఈ దర్శనం శబరిమలపై చేసుకోలేని వారు.. ఇక్కడే తమ ఇళ్లలో పద్దెనిమిది మెట్లకు గుర్తుగా పద్దెనిమిది దీపాలను వెలిగించి.. జ్యోతి దర్శనం చేసుకుంటారు.. స్వామి భక్తులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి