Frogs in Dreams: మీకు కలలో తరచుగా కప్పలు కనిపిస్తున్నాయా? దాని అర్ధం.. ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

Frog Dream Meaning: నిద్రపోతుంటే మనిషి రకరకాల కలలు కంటాడు. ఒకొక్కరికి ఒకొక్క కలలు వస్తాయి. కొంతమందికి జంతువులు కలలోకి వస్తే.. మరికొందరికి చెట్లు, ఇంకొందరికి భయంకరమైన సన్నివేశాలు ఇలా అనేక రకాల..

Frogs in Dreams: మీకు కలలో తరచుగా కప్పలు కనిపిస్తున్నాయా? దాని అర్ధం.. ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
Frog Dream
Follow us

|

Updated on: Sep 07, 2021 | 11:15 AM

Frog Dream Meaning: నిద్రపోతుంటే మనిషి రకరకాల కలలు కంటాడు. ఒకొక్కరికి ఒకొక్క కలలు వస్తాయి. కొంతమందికి జంతువులు కలలోకి వస్తే.. మరికొందరికి చెట్లు, ఇంకొందరికి భయంకరమైన సన్నివేశాలు ఇలా అనేక రకాల కలలు వస్తాయి. తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయని హిందువుల నమ్మకం.. అయితే కొన్ని కలలు వారి వారి భవిష్యత్ లో జరగబోయే మంచి చెడులు ప్రతీక. జంతువులు కలలో కనిపించే విధానం..  మీ జీవితానికి ప్రాతినిధ్యం వహిస్తాయని కొంతమంది విశ్లేస్తున్నారు. కొంతమంది ఏ జంతువు కనిపిస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో.. తమకు రోజులో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి అని భయపడుతుంటారు. ఈరోజు ఉభయచర జీవి కప్పు కలలోకి వస్తే.. ఎటువటిని ఫలితం ఎదురవుతుందో తెలుసుకుందాం..

కప్పలు అదృష్టం, జీవిత చక్రం, సంతానోత్పత్తి, సానుకూల పరివర్తనాలు, పునర్జన్మ, అదృష్టం, ప్రాచీన జ్ఞానం, మనల్ని మనం సాధించుకునే సామర్ధ్యాలు మొదలైనవాటిని సూచిస్తాయి. అంటే కప్పలు కలలోకి వస్తే.. ప్రేమ, జీవితంలో కలిగే మార్పు , శ్రేయస్సు, మన అవగాహన, మనస్సు, పరిస్థితుల సందర్భాన్ని సూచిస్తాయన్నమాట.

కప్ప కలలు లోతైన సంకేత అర్థాలను కలిగి ఉంటాయి. ఒకరి అంతర్గత భావాలు, భావోద్వేగాలు, జీవిత పరిస్థితులు, అంతర్ దృష్టిని సూచిస్తాయట.

కప్ప గురించి కలలు..  కొంతమంది కప్పను తొక్కినట్లు, మరొకరు కప్పను పట్టుకున్నట్లు.. ఇంకొందరికి రంగురంగుల కప్పలు.. ఇలా రకరకాల కప్పల కలలు వస్తాయి.

కలలో కప్పను చూడటం: 

కప్పలు .. వాటి సహజ పరిసరాల్లో ఉన్నట్లు లేదా గడ్డి, పొలాలు, నది మొదలైన వాటిల్లో ఉన్న కప్పలు కలలోకి వస్తే.. అది అదృష్టానికి సంకేతంగా  మీ చుట్టూ ఉన్న ప్రతిదీ బాగా జరుగుతోందని, మీరు సంతోషంగా ఉంటారని సంకేతం.

కప్పను పట్టుకోవడం లేదా వెంటాడుతున్నట్లు కల వస్తే

కప్పను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వస్తే.. మీరు మీ జీవితంలో ఒక వ్యక్తిని, సంబంధాన్ని, ఉద్యోగాన్ని, అవకాశాన్ని లేదా ఏదైనా పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండవచ్చు.

కప్ప మీమీద తిరగబడినట్లు కల వస్తే.. 

మీరు వెంటాడుతున్న కప్ప తిరిగి మీపై దాడి చేస్తున్నట్లుగా వచ్చినా లేదా అది మిమ్మల్ని కరిచినట్లు కల వస్తే, జీవితంలో ఒక దశలో మీరు మీ శక్తి మేరకు పనిని చేయడంలో విఫలమై ఉండవచ్చు. జీవితంలో వైఫల్యానికి సంకేతంగా ఈ కలను భావించవచ్చు.

కలలో కప్పలు వణుకుతుంటే: 

ఇది శుభసంకేతమట.  మీ సన్నిహితులతో మంచి రిలేషన్ ను సూచిస్తుందని కొందరు.. అతిథుల రాకకు ఇది సంకేతమని ఇంకొందరు  నమ్ముతారు. మీరు కొంతకాలంగా కలుసుకోని వారిని కలవడం కలుసుకుంటారు.

 కలలో కప్పను చంపడం: 

ఇది మీ శత్రువులపై మీ విజయాన్ని సూచిస్తుంది. లేదా, మీ శత్రువులను వదిలించుకోవడం. కొన్నిసార్లు, ఇది ప్రతికూల అర్థాన్ని కూడా కలిగి ఉంటుంది.  ఇలా కలలో కప్పను చంపినట్లు వస్తే..  సన్నిహితుడి మరణానికి ముందస్తు సంకేతమని కొందరు నమ్ముతారు.

గోదురు కప్ప లేదా బండ కప్ప: 

బండ కప్ప గురించి కలలు కనడం మంచి సంకేతం. ఇది సమీప భవిష్యత్తులో శాంతి , విజయాన్ని సూచిస్తుంది. మీ కలలో ఒక చిన్న కప్ప కనిపిస్తే  మీ భవిష్యత్తు ప్రణాళికలన్నింటినీ సాధించడం. ఇది ఒత్తిడిని నివారించి ఆనందకరమైన జీవితాన్ని గడపాలని కూడా మీకు చెబుతుంది.

డ్రీమ్ గ్రీన్ ఫ్రాగ్ : 

ఆకుపచ్చ కప్పల కలలు మంచి , సంతోషకరానికి చిహ్నాలు. మరీ ముఖ్యంగా, ఇది మీ మానసిక ,  భావోద్వేగ ఆరోగ్యాన్ని సూచిస్తుంది.

బ్లాక్ ఫ్రాగ్ డ్రీమ్:

నల్ల కప్ప కూడా బాధ , భావోద్వేగ అనారోగ్యానికి సంకేతం.

Also Read: విదుర నీతిలోని మేటి కథ.. కుమారులు చేసిన తప్పులను సరిదిద్దకపోతే.. రాజుగా తండ్రిగా అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తావు.