Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో లక్కీ వెదురు మొక్క పెంచుకోవడానికి వాస్తు నియమాలు.. ఏ దిశలో, ఏ ప్రదేశంలో ఉంచాలంటే.. 

వాస్తు ప్రకారం ఇంట్లో లేదా ఆఫీసులో వెదురు మొక్కను పెంచడం శుభపరిణామంగా పరిగణించబడుతుంది. ఇది వెదురు మొక్కలోని కొమ్మలపై ఆధారపడి ఉంటుంది. అంటే 11 కొమ్మలున్న వెదురును నాటడం మంచిది. 2 కొమ్మలు ప్రేమ .. వైవాహిక జీవితానికి, 3 కొమ్మలు సంతోషకరమైన జీవితానికి, 5 కొమ్మలు ఆరోగ్యానికి, 10 కొమ్మలు పరిపూర్ణ జీవితానికి..  21 కొమ్మలు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి శుభప్రదంగా భావిస్తారు. 

Vastu Tips: ఇంట్లో లక్కీ వెదురు మొక్క పెంచుకోవడానికి వాస్తు నియమాలు.. ఏ దిశలో, ఏ ప్రదేశంలో ఉంచాలంటే.. 
Bamboo Vastu Plant
Follow us
Surya Kala

|

Updated on: Aug 27, 2023 | 7:30 AM

ఇంటిని అందంగా ఉంచుకోవడానికి చాలా మంది ఇండోర్ ప్లాంట్స్ కొని పెంచుకుంటారు. వాస్తు ప్రకారం, ఇంటి లోపల పచ్చని మొక్కలను పెంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. అంతేకాదు అదృష్టాన్ని పెంచడంలో సహాయపడే వివిధ మొక్కలు వాస్తులో ఉన్నాయి. అందులో ఒకటి వెదురు మొక్క. చాలా మంది ఈ వెదురు మొక్కను తమ ఇళ్లలోనే కాకుండా ఆఫీసుల్లో కూడా పెంచుకుంటారు. ఎందుకంటే వెదురు మొక్క అదృష్టాన్ని కలిగిస్తుంది. అంతేకాదు డబ్బు సమస్యలను తొలగిస్తుంది. అయితే ఇంట్లో సరైన దిశలో వెదురు మొక్కను పెంచుకోవాలి. వెదురు మొక్కను తప్పు దిశలో పెంచినట్లయితే.. ఆ ప్రభావం ఇంటి ఆర్థిక స్థితిపై ప్రతికూలంగా ప్రభావితం చూపిస్తుంది. కనుక ఇంట్లో వెదురు మొక్కను ఏ దిశలో పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెదురు మొక్కను ఎందుకు పవిత్రమైనదిగా భావిస్తారంటే..

వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్క అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది. వెదురు మొక్క సానుకూల శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. గృహ ఆదాయాన్ని పెంచుతుంది. ఇంటికి సంపద, శ్రేయస్సు తెస్తుంది. అంతేకాకుండా ఈ మొక్క మనస్సు , ఆత్మకు శాంతిని కలిగిస్తుంది.

వెదురు మొక్కకు ఎన్ని శాఖలు ఉండాలంటే..

వాస్తు ప్రకారం ఇంట్లో లేదా ఆఫీసులో వెదురు మొక్కను పెంచడం శుభపరిణామంగా పరిగణించబడుతుంది. ఇది వెదురు మొక్కలోని కొమ్మలపై ఆధారపడి ఉంటుంది. అంటే 11 కొమ్మలున్న వెదురును నాటడం మంచిది. 2 కొమ్మలు ప్రేమ .. వైవాహిక జీవితానికి, 3 కొమ్మలు సంతోషకరమైన జీవితానికి, 5 కొమ్మలు ఆరోగ్యానికి, 10 కొమ్మలు పరిపూర్ణ జీవితానికి..  21 కొమ్మలు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి శుభప్రదంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

వెదురు మొక్కను ఏ దిశలో, ఏ ప్రదేశంలో ఉంచాలంటే..

  1. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు మీ ఇంట్లో లేదా కార్యాలయంలో వెదురు మొక్కను ఉంచినట్లయితే, తూర్పు దిశలో ఉంచడం చాలా మంచిది. వెదురు మొక్కను ఈ దిశలో ఉంచడం వల్ల సుఖ శాంతులు కలుగుతాయి.  ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
  2. వెదురు మొక్కను ఎప్పుడూ కిటికీ దగ్గర పెట్టకూడదు. సూర్యకాంతి పడే ప్రదేశంలో వెదురు మొక్కను పెంచవద్దు. వెదురు మొక్క ఎండకు ఎండిపోతే ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది.
  3. వాస్తు ప్రకారం వెదురు మొక్కను 2 నుంచి 3 అడుగుల ఎత్తులో పెంచడం మంచిది. ఇంత పొడవాటి వెదురు మొక్కను ఆఫీసులో పెంచితే ఆఫీస్ వాతావరణం బాగుండడంతో పాటు నెగెటివ్ ఎనర్జీ చుట్టుముట్టదు.
  4. వాస్తు ప్రకారం వెదురు మొక్కను పడమర దిక్కున పెంచితే పిల్లలు ఇంట్లో చదువుకుంటే వారి మానసిక స్థితి బాగుంటుంది. ఆ వెదురు మొక్కలో రూపాయి నాణెం వేస్తే పిల్లల మూడ్ స్థిరపడుతుంది.
  5. వాస్తు ప్రకారం ఉత్తర దిశలో వెదురు మొక్కను పెడితే వ్యాపారభివృద్ధి జరుగుతుంది. అలాగే ఆ వెదురు మొక్క దగ్గర నీలిరంగు రాయిని ఉంచడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి.
  6. ఇంట్లో వెదురు మొక్కను పెంచితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి సదా నివసిస్తుంది. ఫలితంగా ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్
ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా
ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా
కోపంతోపాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. డేంజర్
కోపంతోపాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. డేంజర్
వివాహత స్త్రీ కాలిమెట్టెలు పోగొట్టుకోవడం శుభమా? అశుభమా? తెలుకోండి
వివాహత స్త్రీ కాలిమెట్టెలు పోగొట్టుకోవడం శుభమా? అశుభమా? తెలుకోండి
హిట్ 3 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన హీరోయిన్..
హిట్ 3 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన హీరోయిన్..
4 రోజుల్లో EAPCET 2025 పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం నిబంధ అమలు
4 రోజుల్లో EAPCET 2025 పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం నిబంధ అమలు
ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్
ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్
JEE అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. రాత పరీక్ష తేదీ
JEE అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. రాత పరీక్ష తేదీ
ఈప్రత్యేక యాప్ తోనే ఉగ్రవాదుల నరమేథం శిక్షణ ఇచ్చింది పాక్ ఆర్మీనే
ఈప్రత్యేక యాప్ తోనే ఉగ్రవాదుల నరమేథం శిక్షణ ఇచ్చింది పాక్ ఆర్మీనే
IPS టు IAS... యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన తెలుగు కుర్రోడు!
IPS టు IAS... యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన తెలుగు కుర్రోడు!