- Telugu News Spiritual Vastu Tips in Telugu: What Direction Children Should Sit To Improve In Studies Discover
Vastu Tips For Kids Study: మీ పిల్లల ఏకాగ్రతతో చదువుకోవాలంటే ఏ దిశలో కూర్చోవాలంటే..
తల్లిదండ్రులు తమ శక్తి మించి కష్టపడేది తమ పిల్లలకోసమే.. వారు బాగా చదువుకోవాలని.. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలతో జీవించాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. తాము కన్న కలలు నిజం అయ్యేలా తమ శక్తికి మించి తమ పిలల్లని చవిస్తారు కూడా.. పిల్లలు చదువులో హుషారుగా ఉండాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని సహజంగా కోరుకుంటారు.
Updated on: Sep 11, 2023 | 2:15 PM

తమ పిల్లల చదువు విషయంలో ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అయితే ప్రసుతం ర్యాంకుల కాలం నడుస్తోన్నందున కొంత మంది పిలల్లు రోజంతా చదువుకోవడమే పనిగా పెట్టుకుంటారు. అయితే ఎంత చదివినా అందుకు తగిన ప్రతిఫలం దక్కకపోతే.. నిరాశ పడతారు. ఈ నేపథ్యంలో వాస్తు శాస్త్రంలో పిల్లల చదువు కొన్ని నియమాలు పేర్కొంది. అవి ఏమిటో తెలుసుకుందాం..

కొంతమంది పిల్లలు ఎన్ని గంటలు చదివినా అందుకు తగిన విజయం లేదా మంచి మార్కులు పొందలేరు. ఏకాగ్రత ఉండడం లేదని.. చదివింది గుర్తు లేదంటూ ఇబ్బంది పడతారు కూడా.. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకునే సమయంలో సరైన దిశలో కూర్చునే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని వాస్తు శాస్త్రం సలహా ఇస్తుంది.

పిల్లల కోసం ప్రత్యేక గది లేదా స్టడీ రూమ్ ఉంటే వారు చదువుకోవడానికి కూర్చునే దిశకు వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లల బుక్‌కేస్ లేదా బుక్ స్టాండ్ స్టడీ రూమ్‌లో లేదా వారి గదిలో పశ్చిమ దిశలో ఉండాలి. పశ్చిమాన తగినంత స్థలం లేనట్లయితే, మీరు దానిని కొద్దిగా దక్షిణ వైపున అమర్చుకోవచ్చు.

పిల్లలు చదువుకునే సమయంలో తూర్పు ముఖంగా ఉండేలా టేబుల్ లేదా ఇతర ఏర్పాట్లు చేయాలి. తూర్ప ముఖంలో చదుకునే సౌకర్యం లేనట్లు అయితే.. ఈశాన్య దిశలో ముఖం పెట్టి కూడా చదువుకోవచ్చు. దీనివల్ల పిల్లలకు చదువు విషయంలో ఏకాగ్రత లభిస్తుంది. చదివిన సబ్జెక్ట్ ను ఈజీ గ్రహించగలుగుతారు. అలాగే, చదువుతున్నప్పుడు పిల్లల వెనుక భాగంలో ఎల్లప్పుడూ కిటికీ లేదా తలుపు ఉండాలి. వాస్తు శాస్త్రంలో స్టడీ టేబుల్ ఎల్లప్పుడూ చతురస్రంగా ఉండాలని పేర్కొంది.

వాస్తు శాస్త్రం ప్రకారం, పిల్లల గది లేదా స్టడీ రూమ్ రంగు కూడా ముఖ్యమైనది. పిల్లల కోసం ప్రత్యేక స్టడీ రూమ్ లేకపోతే, వారి గదిని లేత పసుపు, లేత గులాబీ లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోవాలి. పసుపు , ఆకుపచ్చ రంగులు జ్ఞానానికి సంబంధించిన రంగుగా పరిగణించబడుతున్నాయి. ఈ రంగులను ఎంచుకోవడం వల్ల పిల్లల మేధో సామర్థ్యం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

పిల్లలు చదువుకునే సమయంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం అవసరం. దీని కోసం, స్టడీ రూమ్ లేదా పిల్లల గదిలో కొన్ని పోస్టర్లు లేదా పెయింటింగ్స్ ఉంచండి. మంచి మంచి ఆలోచనలు, ప్రముఖుల కోట్స్ లేదా కొన్ని అధ్యయన సంబంధిత చార్ట్‌లతో కూడిన పోస్టర్‌ను ఉంచవచ్చు. దానితో పాటు కొంతమంది గొప్ప వ్యక్తులు లేదా క్రీడాకారుల ఫోటోలను కూడా ఉంచవచ్చు.





























