Vastu Shastra: ఇంట్లో టీవీ, ఫ్రిజ్, సోఫా సెట్ ఆ ప్రాంతంలో పెడుతున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Vastu Shastra: ప్రతీ ఒక్కరూ తమకు ఒక సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు. చిన్నదైనా సరే సొంత ఇల్లు ఉంటే.. ఆ భరోసా వేరు అనే భావన ఉంటుంది.

Vastu Shastra: ఇంట్లో టీవీ, ఫ్రిజ్, సోఫా సెట్ ఆ ప్రాంతంలో పెడుతున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Vastu Shastra
Follow us

|

Updated on: Sep 01, 2022 | 3:57 PM

Vastu Shastra: ప్రతీ ఒక్కరూ తమకు ఒక సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు. చిన్నదైనా సరే సొంత ఇల్లు ఉంటే.. ఆ భరోసా వేరు అనే భావన ఉంటుంది. అందుకు ఎంతో కష్టపడి మరీ సొంతిల్లు నిర్మించుకుంటారు. అయితే, ఇల్లు అనేది జీవితంలో చాలా ముఖ్యం. జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు ఇంటి నిర్మాణంలో, ఇంట్లో ఏర్పాటు చేసే వస్తువుల స్థల విషయాలు ఉంటాయి. అందుకే.. చాలా మంది ఇల్లు నిర్మాణం విషయంలో మంచి జరుగలేదని, ఏదో దోషం ఉందని జ్యోతిష్య పండితులను, వాస్తు నిపుణులను సంప్రదించడం జరుగుతుంంది. ఎందుకంటే.. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. అది మన సంతోషానికి, ఐశ్వర్యానికి, అదృష్టానికి సంబంధించినది. అందుకే. ఇల్లు నిర్మాణం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఇల్లు నిర్మాణం తరువాత ఇంట్లో ఏర్పాటు చేసే ఫ్రిజ్, సోఫా, బెడ్ మొదలైన వాటిని ఎక్కడ పెట్టాలో వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో ఫర్నీచర్ ఎక్కడ పెట్టాలి..

ఇంట్లో తేలికైన, బరువైన ఫర్నీచర్ ఏర్పాటు చేయడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు పేర్కొనడం జరిగింది. తేలికపాటి ఫర్నిచర్‌ను ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. భారీ సైజ్‌, పెద్ద పెద్ద ఫర్నిచర్‌ను దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. అయితే, వీటిని ఏర్పాటు చేసేటప్పుడు పుంజం ఉండకుండా చూసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. సోఫా, దివాన్‌ను డ్రాయింగ్ రూమ్‌లో దక్షిణం లేదా పడమర దిశలో ఏర్పాటు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇంట్లో ఫ్రిజ్ ఎక్కడ ఏర్పాటు చేయాలి..

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఫ్రిజ్ ఉంచడానికి అత్యంత అనుకూలమైన దిశ వాయువ్య దిశ. అలాగే ఆగ్నేయ దిశలోనూ ఏర్పాటు చేయొచ్చు.

టీవీ, టెలిఫోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలి..

వాస్తు శాస్త్రం ప్రకారం డ్రాయింగ్ రూమ్ అందాన్ని పెంచడానికి టీవీ సెట్లు, టెలిఫోన్లను ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేయాలి. ఈ రెండు వస్తువులను ఈశాన్యంలో ఎప్పుడూ ఉంచకూడదు.

ఇంట్లో అద్దం ఎక్కడ పెట్టాలి..

వాస్తు ప్రకారం అద్దం ఎల్లప్పుడూ ఇంట్లో ఉత్తరం గానీ తూర్పు దిశలో గానీ ఉంచాలి. ఈ రెండు దిక్కులలో అద్దం ఉంచితే శుభప్రదమని నిపుణులు చెబుతున్నారు. అయితే, అద్దాన్ని మర్చిపోయి కూడా బెడ్‌రూమ్‌లో ఏర్పాటు చేయొద్దు. అలా చేస్తే కుటుంబంలో అలజడి చలరేగుతుందన్నారు. అలాగే, ఒక అద్దం ముందు మరో అద్దం అస్సలు పెట్టకూడదు.

ఇంట్లో ఔషధాలు ఎక్కడ పెట్టాలి..

వాస్తు శాస్త్రంలో ఔషధాలను ఉంచే ముఖ్యమైన నియమం పేర్కొనడం జరిగింది. దీని ప్రకారం ఔషధాలు లేదా ప్రథమ చికిత్స కిట్ ఎల్లప్పుడూ ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం.. మందులు మరచిపోయి కూడా దక్షిణ దిశలో గానీ, వంటగదిలో కానీ ఉంచకూడదు. అదేవిధంగా, మందులను ఎప్పుడూ మంచం పక్కన ఉంచకూడదు.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కేవలం మత విశ్వాసాలు, వాస్తు శాస్త్రం ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రజల సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని పబ్లిష్ చేయడం జరిగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?