AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulasi: తులసి చెట్టు వద్ద ఈ 5 వస్తువులు అస్సలు పెట్టొద్దు.. జీవితంలో ఇబ్బందులు తప్పవు!

భారతీయ సనాతన ధర్మంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చాలామంది హిందువుల ఇళ్లలో ఖచ్చితంగా తులసి మొక్క ఉంటుంది. ఆ మొక్కకు ప్రతి రోజూ పూజలు చేస్తుంటారు.

Tulasi: తులసి చెట్టు వద్ద ఈ 5 వస్తువులు అస్సలు పెట్టొద్దు.. జీవితంలో ఇబ్బందులు తప్పవు!
Tulasi Rules
Shiva Prajapati
|

Updated on: Mar 15, 2023 | 11:21 AM

Share

భారతీయ సనాతన ధర్మంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చాలామంది హిందువుల ఇళ్లలో ఖచ్చితంగా తులసి మొక్క ఉంటుంది. ఆ మొక్కకు ప్రతి రోజూ పూజలు చేస్తుంటారు. దీపం వెలిగించి ప్రార్థనలు చేస్తుంటారు. అయితే, తులసి మొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు వేద పండితులు. మనం తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లే.. ఇంట్లో అనేక ఇబ్బందులకు కారణాలు అవుతాయని చెబుతున్నారు. మరి తెలియకుండా చేసే పొరపాట్లు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. వాస్తు శాస్త్రం ప్రకారం.. తులసి చెట్టు సమీపంలో పొరపాటున కూడా శివలింగాన్ని ఉంచకూడదు. తుసికి మహా విష్ణువుకు ప్రతీకరమైనది. జలంధరుడు అనే రాక్షసుడి భార్య అయిన తులసికి గత జన్మలో బృందా అనే పేరు ఉండేదట. అయితే, జలంధరుడిని పరమ శివుడు సంహరించాడట. ఈ కారణంగా పరమ శివుడిని తులసితో పూజించరని వేద పండితులు చెబుతున్నారు.

2. తులసి చెట్టు వద్ద గణేషుడి విగ్రహం ఉంచకూడదని శాస్త్రాలు, వేద పండితులు చెబుతున్నారు. పౌరాణిక కథ ప్రకారం.. గణేషుడు నది ఒడ్డున తపస్సు చేస్తుండగా తులసి దేవి నదిలోంచి బయటకు వస్తుంది. ఆమె గణపతి అందానికి ముగ్ధురాలైన ఆమె.. పెళ్లి ప్రతిపాదన చేస్తుంది. అయితే, గణేషుడు ఆమెను నిరాకరించగా.. ఆగ్రహించిన తులసి రెండు వివాహాలు చేసుకుంటావని గణేషుడిని శపిస్తుందట. అలా తులసి చెట్టు వద్ద గణేషుడి ప్రతిమ పెట్టకూడదని చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

3. వాస్తు శాస్త్ర ప్రకారం.. తులసి చెట్టు ఉన్న ప్రదేశంలో చెప్పులు, బూట్లు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఫలితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.

4. తులసి చెట్టు దగ్గ ఎప్పుడూ చెత్త బుట్టను ఉంచకూడదు. తులసి మొక్క చుట్టూ చెత్త వేయడం వల్ల ఇంట్లో ఆర్థిక, అనారోగ్య కష్టాలు మొదలవుతాయి.

5. మత గ్రంధాల ప్రకారం.. తులసి మొక్క వద్ద పొరపాటున కూడా చీపురు, చెత్త ఉంచకూడదు. తులసి మొక్క దగ్గర చీపురు పెడితే ఇంట్లో అశుభం జరుగుతుందని అంటారు.

గమనిక: పైన పేర్కొన్న కథనం ప్రజల ఆచారాలు, మత విశ్వాసాలు, వేద పండితులు తెలిపిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?