Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు అస్సలు చేయకండి..! లేకుంటే ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది..!

మన పూర్వీకులు కొన్ని రకాల ఆచారాలు, సంప్రదాయాలను పాటించాలని చెప్పినప్పుడు వాటికి వెనుక గల కారణాలను కూడా గమనించాలి. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని పనులను సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చేయకూడదని సూచిస్తారు. ఇవి ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా.. శాస్త్రీయంగా కూడా మనకు ప్రయోజనం కలిగించేవే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Prashanthi V

|

Updated on: Jan 30, 2025 | 5:00 PM

సాయంత్రం వేళలో ఎవరికైనా అప్పులు ఇవ్వకూడదు. ఇది ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని చెబుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోకుండా ఉండాలంటే.. ఈ నియమాన్ని పాటించడం మంచిది. అలాగే ఈ సమయంలో ఉప్పును దానం చేయకూడదు అది కూడా ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని నమ్ముతారు.

1 / 7
ఇంట్లో తులసి మొక్క ఉంచడం చాలా శుభప్రదమైనది. ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే సాయంత్రం వేళ తులసి ఆకులను కట్ చేయడం లేదా మొక్కను తొలగించడం చేయకూడదు. కనీసం తాకకూడదట. ఇది చెడు శక్తులను ఆహ్వానించడమే కాకుండా.. ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

2 / 7
మీ ఇంటికి సాయంత్రం వేళ ఎవరైనా అతిథిగా వచ్చినప్పుడు వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. ఏదైనా చిన్న నైవేద్యం లేదా తినుబండారాన్ని ఇచ్చి పంపించాలి.

3 / 7
సాయంత్రం వేళ గోళ్లను కత్తిరించడం, హెయిర్ కట్ చేసుకోవడం, షేవింగ్ చేసుకోవడం చేయకూడదు. దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయని నమ్మకం.

4 / 7
వాస్తు శాస్త్రం ప్రకారం.. సాయంత్రం సమయంలో చీపురుతో ఇల్లు ఊడడం మంచిది కాదని చెబుతారు. దీనివల్ల ఇంట్లోని ధనవృద్ధి తగ్గిపోతుందని విశ్వాసం. అదే సమయంలో శుభ్రత ఎంతో ముఖ్యం కాబట్టి ఉదయం పూటే ఇంటిని శుభ్రం చేసుకోవడం ఉత్తమం.

5 / 7
సాయంత్రం వేళ పాలు, పెరుగు, పంచదార వంటి తెల్లని పదార్థాలను ఎవరికీ ఇవ్వకూడదు. వీటిని చంద్రుడికి సంబంధించి పవిత్రంగా భావిస్తారు. ఈ నిబంధనను పాటించకపోతే మనశ్శాంతి తగ్గిపోవచ్చని నమ్మకం.

6 / 7
సాయంత్రం వేళ ఇంట్లో చెత్తను బయట వేస్తే.. చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఉదయం వేళలో మాత్రమే ఇంట్లో చెత్తను తొలగించడం మంచిది.

7 / 7
Follow us