Vaikuntha Ekadashi: సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు శ్రీహరి పాదాల చెంత చోటు ఇచ్చే ఈ ఏకాదశి.. వ్రతం నియమాలు

Vaikuntha Ekadashi 2022: పుష్య మాసం లో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశిని పుత్ర ఏకాదశి ( Paush Putrada Ekadashi)అంటారు..

Vaikuntha Ekadashi: సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు శ్రీహరి పాదాల చెంత చోటు ఇచ్చే ఈ ఏకాదశి.. వ్రతం నియమాలు
Saphala Ekadashi
Follow us
Surya Kala

|

Updated on: Jan 12, 2022 | 9:10 AM

Vaikuntha Ekadashi 2022: పుష్య మాసం లో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశిని పుత్ర ఏకాదశి ( Paush Putrada Ekadashi)అంటారు. సంతానం లేని వారు ఈరోజు ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరిస్తే.. సంతానం కలుగుతుందని విశ్వాసం. అంతేకాదు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి మోక్ష ద్వారం తెరచిఉంటుందని నమ్మకం. ఈ ఏడాది ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం 13 జనవరి 2022 గురువారం నాడు వచ్చింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉపవాసం చేయల్సిన విధానం, శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత, నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శుభ సమయం వైకుంఠ ఏకాదశి తిథి జనవరి 12వ తేదీ సాయంత్రం 04:49 గంటలకు ప్రారంభమై జనవరి 13వ తేదీ సాయంత్రం 7.32 గంటలకు ముగుస్తుంది. హిందూమతంలో పొద్దున్న వచ్చే తిథికి అధిక ప్రాముఖ్యత ఉంది. కనుక ఈ వైకుంఠ ఏకాదశి ఉపవశాన్ని ఈనెల 13న పాటించడం మంచిది.

ఉపవాసం ప్రాముఖ్యత ఈరోజు ఉపవాసం చేయడం వలన తమ సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు తమకు మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు. సంతానం లేని దంపతులు వైకుంఠ ఏకాదశి రోజున చేసే వ్రత ప్రభావంతో మంచి సంతానం పొందుతారు. అంతేకాదు పిల్లలకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. శాస్త్రాలలో వైకుంఠ ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను వివరిస్తూ.. వైకుంఠ ఏకాదశి రోజున, విష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని చెప్పబడింది. దీంతో ఎవరైనా ఏకాదశి రోజున పూర్తి భక్తి శ్రద్దలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో.. వారు మరణానంతరం.. వైకుంఠ ధామంలో నారాయణుని పాదాల వద్ద స్థానం పొందుతాడు.

ఉపవాసం, పూజలు ఏకాదశి రోజున తెల్లవారు జామున నిద్రలేచి గంగాజలం పోసిన నీటితో స్నానమాచరించాలి. మనస్సులో భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలి. పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకుని నారాయణున్ని పూజించాలి. విశ్నుడుకి ధూపం, దీపం, పుష్పాలు, అక్షత, పూలమాల, నైవేద్యాన్ని సమర్పించండి. పంచామృతం, తులసిని సమర్పించండి. అనంతరం నారాయణుని మంత్రాలను జపించండి. అనంతరం వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదవండి. చివరగా ఆరతి ఇస్తే..వైకుంఠ ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది. రోజంతా ఉపవాసంగా ఉండండి.. కేవలం తులసి తీర్ధం మాత్రమే తీసుకోండి. రాత్రిపూట పండ్లు తిని జాగారం చేస్తూ భగవంతుని ధ్యానించండి. ద్వాదశి రోజున స్నానమాచరించి బ్రాహ్మణునికి అన్నదానం చేసి అతనికి శక్తికి తగినట్లు దానధర్మాలు చేయాలి. అనంతరం ఉపవాసం విరమించండి.

ఉపవాస నియమాలు 1-ఏకాదశి వ్రతం చేయాలనుకునే వారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి నియమాలు అనుసరించాలి. కనుక జనవరి 13న ఉపవాసం ఉండాలని భావిస్తే.. ఈ రోజు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు సాత్విక ఆహారం తీసుకోవాలి.

2- ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి.

3- ఏకాదశి ముందు రాత్రి నేలపై నిద్రించండి.

4- ఏకాదశి రాత్రి, జాగారం చేస్తూ భగవంతుని ధ్యానం, భజన చేయాలి

5- మీ మనస్సులో చెడు ఆలోచనలు తీసుకురావద్దు. ఎవరినీ దూషించవద్దు , అమాయకులను వేధించవద్దు.

6- ద్వాదశి రోజున, బ్రాహ్మణునికి భోజనం పెట్టిన అనంతరం ఉపవాసం విరమించండి.

Also Read:  చైనాలో ఒమిక్రాన్ టెర్రర్.. లాక్ డౌన్ లో మూడో నగరం.. సాముహిక కరోనా పరీక్షల నిర్వహణ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే