AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SV. Museum: శ్రీవారి ఆభరణాల విశిష్టత తెలిసేలా శ్రీవారి మ్యూజియాన్ని తీర్చిదిద్దనున్న టీటీడీ.. వచ్చే బ్రహ్మోత్సవాలనాటికి అందుబాటులోకి

SV. Museum: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియాన్ని సరికొత్తగా అభివృద్ధి చేసి వచ్చే దిశగా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మ్యూజియాన్ని వచ్చే బ్రహ్మోత్సవాల..

SV. Museum: శ్రీవారి ఆభరణాల విశిష్టత తెలిసేలా శ్రీవారి మ్యూజియాన్ని తీర్చిదిద్దనున్న టీటీడీ.. వచ్చే బ్రహ్మోత్సవాలనాటికి అందుబాటులోకి
Sri Venkateswara Museum
Surya Kala
|

Updated on: Nov 28, 2021 | 7:54 PM

Share

SV. Museum: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియాన్ని సరికొత్తగా అభివృద్ధి చేసి వచ్చే దిశగా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మ్యూజియాన్ని వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఆయన మ్యూజియం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మ్యూజియంలో వేలాది పురాతన కళాకృతులు ఉన్నాయని, వీటన్నింటి గురించి భక్తులకు తెలిపేందుకు వీలుగా కంటెంట్ ను టాటా సంస్థ ప్రతినిధులకు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆభరణాల విశిష్టతను భక్తులు తెలుసుకునేలా, ఆకట్టుకునేలా పూర్తి స్థాయిలో కంటెంట్ తయారు చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి టాటా సంస్థ చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేయాలని కోరారు.

మ్యూజియంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలో ఎక్కడెక్కడ ఎయే కళాకృతులు ప్రదర్శనకు ఉంచాలనే విషయంపై ఇంజినీరింగ్ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారని, ఈ ప్రక్రియను మరింత మెరుగుపరిచేందుకు టాటా సంస్థ కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన కోరారు. అభివృద్ధి పనులు పూర్తయితే బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు స్వామివారి వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపేందుకు వీలవుతుందన్నారు. పురాతన కాలం నాటి కళాకృతులు, యుద్ధ సామగ్రి, పాత్రలు తదితరాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయన్నారు.

Also Read:  థియేటర్‌లో ఫ్యాన్స్ చేసిన పనికి మండిపడిన కండల వీరుడు.. ఎందుకంటే..

Follow Us
పాము కాటు వేసిన ఆహార పదార్థాలు తింటే చనిపోతారా? నిజమిదే
పాము కాటు వేసిన ఆహార పదార్థాలు తింటే చనిపోతారా? నిజమిదే
ప్రామిసరీ నోటుపై సంతకం, వేలిముద్ర రెండూ ఉంటే చెల్లుతుందా..?
ప్రామిసరీ నోటుపై సంతకం, వేలిముద్ర రెండూ ఉంటే చెల్లుతుందా..?
వేసవి వేడికి చెక్ పెట్టే బేల్ షర్బత్ ఇది.. ఈజీగా తయారు చేసుకోండి
వేసవి వేడికి చెక్ పెట్టే బేల్ షర్బత్ ఇది.. ఈజీగా తయారు చేసుకోండి
30 ఏళ్ల క్రితం కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.. ఇప్పటికీ ట్రెండింగ్
30 ఏళ్ల క్రితం కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.. ఇప్పటికీ ట్రెండింగ్
హనుమంతుడు లేకుండా రాముడు కనిపించడని ఎందుకంటారు?
హనుమంతుడు లేకుండా రాముడు కనిపించడని ఎందుకంటారు?
కొన్ని దోసకాయలు చేదుగా ఎందుకు ఉంటాయి? నిజమిదే!
కొన్ని దోసకాయలు చేదుగా ఎందుకు ఉంటాయి? నిజమిదే!
వట సావిత్రి వ్రతం.. ఈసారి ఎప్పుడు? ఆ శుభ యోగాల విశేషాలేంటి?
వట సావిత్రి వ్రతం.. ఈసారి ఎప్పుడు? ఆ శుభ యోగాల విశేషాలేంటి?
అమ్మనీ ఉడుత ఎంత పనిచేసింది?ఏకంగా ఆర్ట్స్‌ కాలేజీలో 20మందిపై దాడి
అమ్మనీ ఉడుత ఎంత పనిచేసింది?ఏకంగా ఆర్ట్స్‌ కాలేజీలో 20మందిపై దాడి
దట్టమైన అడవిలోనే.. నిండు గర్భిణికి ఎంత కష్టమొచ్చే..
దట్టమైన అడవిలోనే.. నిండు గర్భిణికి ఎంత కష్టమొచ్చే..
బీర్‌లో ఆ అరుదైన విటమిన్ ఉంటుందా? ఆరోగ్యానికి మంచిదేనా?
బీర్‌లో ఆ అరుదైన విటమిన్ ఉంటుందా? ఆరోగ్యానికి మంచిదేనా?