Bollywood: షారుఖ్, అక్షయ్ కుమార్ రిజెక్ట్ చేసిన సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న అజయ్ దేవగన్..
అదృష్టం జీవితంలో తలుపు తట్టినప్పుడు.. ఆ తలుపు తెరవకపోతే.. మరొకరి సొంతం అవుతుంది.. ఈ నమ్మకం సినిమా నటీనటుల విషయంలో నిజం అవుతుంది. ముఖ్యంగా ఒకరు వద్దు అని వదులుకున్న సినిమాలు మరొకరి వద్దకు చేరుకొని అవి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడమే కాదు.. సినీ కెరీర్ లో మైలు స్టోన్స్ గా నిలుస్తాయి. అలా ఒకరు వద్దు అనుకున్న సినిమాలతో అద్భుతమైన సినిమాల్లో నటించాడు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్. తన కెరీర్ లో అక్షయ్ కుమార్ , షారుఖ్ ఖాన్ వంటి హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు అజయ్ ఒడిలోకి వచ్చాయి. వాటిలో నటించడంతో అజయ్ దేవగన్ కెరీర్ కి బూస్ట్ ఇచ్చాయి.

బాలీవుడ్ సూపర్ స్టార్స్ అక్షయ్ కుమార్ , షారుఖ్ ఖాన్ 30 సంవత్సరాల కెరీర్లో అనేక గొప్ప చిత్రాల్లో నటించారు. అయితే ఈ ఇద్దరు హీరోలు కూడా తమ వద్దకు వచ్చిన అనేక సినిమాలను వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారు. అవి తరువాత బ్లాక్ బస్టర్లుగా నినిలిచాయి. ఈ చిత్రాలలో కొన్ని అజయ్ దేవగన్ వద్దకు చేరుకున్నాయి. అతడిని అదృష్టం వరించింది. ఏ సినిమాలను అక్షయ్, షారుఖ్ రిజెక్ట్ చేస్తే అవి అజయ్ దేవగన్ వద్దకు చేరుకున్నాయో.. ఈరోజు తెలుసుకుందాం..
ఫూల్ ఔర్ కాంటే: అజయ్ దేవగన్ బాలీవుడ్ లో వెండి తెరపై ఫూల్ ఔర్ కాంటే సినిమాతో అడుగు పెట్టాడు. అజయ్ కెరీర్‌లో తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’. 1991లో ఈ సినిమాలో తెరక్కిన ఈ మొదటి సినిమాతోనే స్టార్ అయ్యాడు. అయితే ఈ సినిమా మొదట అజయ్ దేవగన్ కంటే ముందే అక్షయ్ కుమార్ కు ఆఫర్ చేశారు. అయితే అక్షయ్ దానిని తిరస్కరించాడు. అప్పుడు అజయ్ దేవగన్ వద్దకు చేరుకుంది.
ఓంకార: అజయ్ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో ‘ఓంకార’ ఒకటి. ఇందులో ఆయన ఓంకార అనే పాత్రను పోషించారు. అయితే 2006లో విడుదలైన ఈ చిత్రంలో అజయ్ పోషించిన పాత్ర కోసం, మొదట మనోజ్ బాజ్‌పేయిని సంప్రదించారట. మనోజ్ తిరస్కరించడంతో ఈ సినిమా అజయ్ వద్దకు చేరుకుంది.
గంగా జల్: ‘సింగం’లో అజయ్ దేవగన్ పోలీస్ పాత్ర అభిమానులకు చాలా నచ్చింది. అయితే అజయ్ ‘గంగాజల్’లో యూనిఫాం ధరించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. 2003లో రిలీజైన ఈ సినిమాలో అమిత్ కుమార్ అనే పాత్రను ఆయన పోషించారు. ఈ పాత్రను మొదట అక్షయ్ కుమార్ ని చిత్ర యూనిట్ సంప్రదించింది. అక్షయ్ కుమార్ నో చెప్పిన తర్వాత.. గంగాజల్ లోని పాత్ర అజయ్ వద్దకు చేరుకుంది. అజయ్ కెరీర్‌లో చిరస్మరణీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ఇష్క్: ‘ఇష్క్’ 1997లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అజయ్ తో పాటు అమీర్ ఖాన్, జూహి చావ్లా, కాజోల్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అజయ్ దేవగన్ కంటే ముందే ఇష్క్ నిర్మాతలు షారుఖ్ ఖాన్ కు ఈ చిత్రాన్ని ఆఫర్ చేశారు. అయితే షారుఖ్ ఖాన్ ఈ సినిమాను తిరస్కరించడంతో అజయ్ దేవగన్ వద్దకు చేరుకుంది.
హమ్ దిల్ దే చుకే సనమ్: ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ ‘హమ్ దిల్ దే చుకే సనమ్’లో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించారు. అయితే 1999లో రిలీజైన ఈ సూపర్ హిట్ చిత్రంలో కూడా అజయ్ మొదటి ఎంపిక కాదు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ పాత్రని ముగ్గురు సూపర్ స్టార్లు తిరస్కరించారు. ఆ తర్వాత ఈ పాత్ర అజయ్ దేవగన్ వద్దకు చేరుకుంది. అజయ్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు. అజయ్ కంటే ముందు అమీర్ ఖాన్, సంజయ్ దత్, షారుఖ్ ఖాన్ లను చిత్ర యూనిట్ సంప్రదించింది. అయితే ఈ ముగ్గురు సూపర్ స్టార్లలో ఎవరూ ఈ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..