అందాల మెహరీన్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టేనా..? 

Rajeev 

21 April 2025

Credit: Instagram

 క్యూట్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా. నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఈ సినిమాలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో హిట్స్ అందుకుంది. జవాన్, పంతం, కవచం సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2, F3 సినిమాలతో హిట్స్ అందుకుంది. ఈ అందాల ముద్దుగుమ్మ. 

కెరీర్ పీక్ లో ఉండగానే.. 2021లో భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. 

ఆతర్వాత సోషల్ మీడియాతో బిజీగా గడిపిన మెహరీన్. 2023లో చిరంజీవ్ మక్వానాతో నిశ్చితార్థం చేసుకుంది.

రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. ఈ ఫోటోలు కుర్రకారుకు కిర్రెక్కిస్తున్నాయి.