Bangaru Bonam: శాకాంబరీగా బెజవాడ దుర్గమ్మ దర్శనం.. బంగారు బోనాన్ని సమర్పించిన భాగ్యనగర వాసులు
తీన్మార్ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, బేతాళ నృత్యాలు, కోలాటాలు నడుమ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు తెలంగాణా ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు బంగారు బోనం సమర్పించారు. గత 14 సంవత్సరాలుగా బెజావాడ దుర్గమ్మకు తెలంగాణ నుండి బోనం సమర్పించడం ఆనవాయితీ
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. క్యూలైన్లు భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఈ రోజు బెజవాడ దుర్గమ్మకు భాగ్యనగర బంగారు బోనాన్ని తెలంగాణా ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు సమర్పించారు.
తీన్మార్ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, బేతాళ నృత్యాలు, కోలాటాలు నడుమ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు తెలంగాణా ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు బంగారు బోనం సమర్పించారు. గత 14 సంవత్సరాలుగా బెజావాడ దుర్గమ్మకు తెలంగాణ నుండి బోనం సమర్పించడం ఆనవాయితీ గా పెట్టుకున్న ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు వందలాదిగా విజయవాడ చేరుకుని జమ్మి దొడ్డి నుండి ప్రత్యేక పూజలు చేసి బంగారు బోనం తో ఊరేగింపు గా ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని సమయానికి వర్షాలు కురిసి రైతులు పాడిపంటలు సమృద్ధితో సంతోషాలతో ఉండేలా దుర్గమ్మ ఆశీర్వదించాలని కమిటీ సభ్యులు దుర్గమ్మ కి బోనం సమర్పించారు.
Reporter: Vikram,Tv9 Telugu
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..