AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shabarimala: శబరిమల వెళ్ళే అయ్యప్ప స్వాములకు అలెర్ట్.. రేపు, ఎల్లుండి దర్శనాల సంఖ్య కుదిరింపు.. పూర్తి వివరాలు మీ కోసం..

అయ్యప్ప దీక్షను తీసుకుని 41 రోజులు పూర్తి చేసుకున్న స్వాములతో శబరిమల క్షేత్రం నిండిపోయింది. అయ్యప్ప దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకుంటున్నారు. రికార్డ్ సంఖ్యలో అయ్యప్పను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుని దీక్షను విరమిస్తున్నారు స్వాములు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శబరిమల మండల పూజకు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Shabarimala: శబరిమల వెళ్ళే అయ్యప్ప స్వాములకు అలెర్ట్.. రేపు, ఎల్లుండి దర్శనాల సంఖ్య కుదిరింపు.. పూర్తి వివరాలు మీ కోసం..
Shabarimala Ayyappa Temple
Surya Kala
|

Updated on: Dec 24, 2024 | 2:05 PM

Share

శబరిమలలో కొలువైన హరిహర సుతుడు అయ్యప్ప దర్శనం కోసం రికార్డ్ స్థాయిలో స్వాములు తరలి వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 26న శబరిమలలో వార్షిక మండల పూజకు సర్వం సిద్ధం అవుతుంది. ఈ మండల పూజకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు అంటే రేపు, ఎల్లుండ (డిసెంబర్ 25, 26 తేదీల్లో) అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలనీ భావిస్తోంది. దీంతో వర్చువల్, స్పాట్‌ బుకింగ్‌లను పరిమితం చేయనున్నట్లు టీడీబీ ప్రకటించింది. ముఖ్యమైన పర్వదినాల సమయంలో భక్తుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

రెండు రోజుల పాటు దర్శనాల సంఖ్య తగ్గింపు

ఈ నెల 26న శబరిమలలో వార్షిక మండల పూజకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అయ్యప్ప మండల పూజ సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తారని భావించిన టీడీబీ రేపు 50వేల మంది భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనుండగా.. ఎల్లుండ 26 తేదీన 60వేలు మంది భక్తులకు మాత్రమే దైవం దర్శనానికి అనుమతిని ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రోజుల పాటు స్పాట్ బుక్ సంఖ్యని కూడా తగ్గించింది. కేవలం 5000 మందికి స్వామివారి దర్శనానికి అనుమతిని ఇవ్వనున్నట్లు టీడీబీ ప్రకటించింది.

ఇప్పటికే ప్రారంభమైన స్వామివారి థంక అంకి ఊరేగింపు రేపు శబరిమల అయ్యప్ప ఆలయం వద్దకు చేరుకుంటుంది. స్వామివారిని రేపు నగలతో అలంకరించనున్నారు. ఈ నేపధ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రేపు కేవలం అయ్యప్ప దర్శనం కోసం 50 వేల మందికి మాత్రమే అనుమతినివ్వనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..