AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: ముఖ ఆకృతి మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.. ఏ షేప్ లో ఉంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారంటే

ఏ వ్యక్తి గురించి అయినా తెలుసుకోవాలంటే.. మీరు ఆ వ్యక్తితో కలవాలి. అయితే మీ వ్యక్తిత్వం లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే.. వారి ముఖాన్ని చూడండి. అవును, ప్రతి ఒక్కరి ముఖ ఆకృతి అందంగా, ప్రత్యేకంగా భిన్నంగా ఉంటుంది. అయితే ముఖా ఆకారం వ్యక్తిత్వం గురించి చెబుతుందని మీకు తెలుసా? ఈ రోజు ఏ రకమైన ముఖాకృతి కలిగి ఉంటె ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారో తెలుసుకుందాం..

Personality Test: ముఖ ఆకృతి మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.. ఏ షేప్ లో ఉంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారంటే
Personality Test
Surya Kala
|

Updated on: Dec 24, 2024 | 12:42 PM

Share

ప్రపంచంలోని వ్యక్తులు ఒకేలా ఉండరు. అదే విధంగా వ్యక్తుల ఆలోచన, నడవడికలో కూడా తేడాలు కనిపిస్తాయి. అయితే ముఖ ఆకారం మీ వ్యక్తిత్వం గురించి మాత్రమే కాదు అవతలి వ్యక్తుల వ్యక్తిత్వం గురించి కూడా చాలా చెబుతుంది. ముఖం ఆకారం చూసి వ్యక్తీ ప్రవర్తన గురించి, వ్యక్తిత్వం గురించి చెప్పవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఇది ఆహ్లాదకరమైన, ఆసక్తికరమైన వ్యక్తిత్వ పరీక్ష. ఇది మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడంలో మాత్రమే కాదు అవతలి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కూడా తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారో అంచనా వేయడానికి మీరు వారితో సమయం గడపవలసిన అవసరం లేదు. అందుకు బదులుగా వారి ముఖ ఆకృతిని చూడటం ద్వారా వ్యక్తి లక్షణాలను వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ రోజు ఏ ముఖం ఆకారం ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుందో తెలుసుకుందాం..

చతురస్రాకార ముఖం: చతురస్రాకారంలో ముఖం ఉన్నవారు మొండి పట్టుదలగల, అత్యంత చురుకైన, విశ్లేషణాత్మక స్వభావం కలిగి ఉంటారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను నివారించడానికి సత్ఫలితాలను పొందడానికి వేగవంతమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు వీరు సృజనాత్మక కలిగి ఉన్న ఆలోచనాపరులు, ప్రశాంతమైన వ్యక్తులు. ఈ వ్యక్తులు ఎంత ఒత్తిడితో కూడిన పరిస్థితిని అయినా ఎదుర్కొంటారు. వీరు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడమే కాదు ఎక్కువ ఆలోచనా సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు.

కోడి గుడ్డు ఆకారంలో ముఖం: ఎవరి ముఖం అయినా అండాకారం లేదా కోడి గుడ్డు ఆకారంలో ఉంటే.. అటువంటి వ్యక్తి దయగలవాడు. తమ చుట్టూ ఉన్న వ్యక్తులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందరినీ తేలికగా నమ్మే వ్యక్తిత్వం వీరి సొంతం అంతేకాదు ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంది. అయితే వీరు తమ లక్ష్యాలను సాధించడంలో ఎంతటి శ్రమకు అయినా వెనుకాడరు. విజయం సాధించే తెలివి కలిగి ఉంటారు. కష్టపడి పనిచేసే వ్యక్తులు. ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించే వ్యక్తిత్వం వీరి సొంతం.

ఇవి కూడా చదవండి

డైమండ్ షేప్డ్ ఫేస్: ముఖం డైమండ్ ఆకారంలో ఉంటే.. వీరు ఏదైనా పనిని ప్రారంభించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా, జాగ్రత్తగా పరిశీలించే వ్యక్తిత్వం వీరి సొంతం. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల ఎంత కష్టమైన పనినైనా పూర్తి చేయగల సామర్థ్యం వీరికి ఉంటుంది.

పొడవాటి ముఖం : పొడవాటి కలిగిన వ్యక్తులు చాలా తెలివైనవారు. ఇతరులతో పోలిస్తే వీరికి తెలివితేటలు ఎక్కువ అని చెప్పవచ్చు. వీరు తటస్థంగా ఉంటారు. సొంత అభిప్రాయాలను కలిగి ఉంటారు. తమను తాము నలుగురికి ప్రదర్శించే విధానం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తారు.

గుండె ఆకారంలో ఉన్న ముఖం: హార్ట్ షేప్ లో ముఖం ఉన్న వ్యక్తులు గొప్ప సృజనాత్మకతను కలిగి ఉంటారు. అంతేకాదు భావోద్వేగాన్ని కలిగి ఉంటారు. అయితే వీరు పట్టిందే పట్టు అన్నట్లు మొండి పట్టుదలగల వారు. దూకుడు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తలవంచరు. వీరి ఆలోచనలకు ధీటుగా నిలబడే వ్యక్తులను మెప్పించే సామర్థ్యం వీరి సొంతం. భావోద్వేగాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో వారికి తెలుసు.

గుండ్రని ముఖం: గుండ్రటి ముఖం గల వ్యక్తులు పెద్ద పెద్ద కలలు కంటారు. చేపట్టిన పనిని ప్రతిష్టాత్మక , ఆచరణాత్మకంగా చేసే వ్యక్తులు. వీరు అన్యాయం అని తెలిసినా.. వ్యతిరేకంగా మాట్లాడటానికి వెనుకాడతారు. వేగంగా ఆలోచిస్తారు. పని చేస్తారు. అందుకనే అందరూ వీరిని ఇష్టపడతారు. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఒత్తిళ్లు వచ్చినా ఓపికతో అన్ని పనులను నిర్వహించే గుణం వీరి సొంతం. ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. తమ మాటలతో, ప్రవర్తనతో అందరినీ ఆకర్షిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే.  .)