Adi Vinayaka Temple: మనిషి రూపంలో వినాయకుడిని కొలిచే ఏకైక గుడి.. ఎక్కడుందంటే..
గణేషుడు రానే వచ్చాడు.. ఊరు.. వాడా.. గల్లీ గల్లీల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో ఆసీనులయ్యారు. దేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు భక్తులు. గణేష్ మండపాల్లో స్వామి వారికి రెండు పూటలా పూజలు చేస్తూ తమ భక్తిని చాటి చెబుతున్నారు. ఇక గణేషుడి ఉత్సవాలు మహారాష్ట్రలో ధూం ధాంగా ఉంటాయి. భారీ స్థాయిలో, ఎత్తైన విగ్రహాలు నెలకొల్పుతారు. అయితే, దేశంలో ఏ ప్రాంతమైనా.. ఏ ప్రదేశమైనా.. ఏ గుడి అయినా.. ఏ మండపం అయినా.. వినాయకుడిని ఏనుగు తల రూపంలో ఉన్న గణనాథుడిగానే కొలుస్తారు. అందమైన ఆ రూపంలో.. పొడవాటి తొండం, బొద్దుగా ఉన్న బొర్రతో చూడచక్కని రూపుతో ఉన్న గణపయ్యను జగమంతా పూజిస్తుంటుంది.
Adi Vinayaka Temple: గణేషుడు రానే వచ్చాడు.. ఊరు.. వాడా.. గల్లీ గల్లీల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో ఆసీనులయ్యారు. దేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు భక్తులు. గణేష్ మండపాల్లో స్వామి వారికి రెండు పూటలా పూజలు చేస్తూ తమ భక్తిని చాటి చెబుతున్నారు. ఇక గణేషుడి ఉత్సవాలు మహారాష్ట్రలో ధూం ధాంగా ఉంటాయి. భారీ స్థాయిలో, ఎత్తైన విగ్రహాలు నెలకొల్పుతారు. అయితే, దేశంలో ఏ ప్రాంతమైనా.. ఏ ప్రదేశమైనా.. ఏ గుడి అయినా.. ఏ మండపం అయినా.. వినాయకుడిని ఏనుగు తల రూపంలో ఉన్న గణనాథుడిగానే కొలుస్తారు. అందమైన ఆ రూపంలో.. పొడవాటి తొండం, బొద్దుగా ఉన్న బొర్రతో చూడచక్కని రూపుతో ఉన్న గణపయ్యను జగమంతా పూజిస్తుంటుంది. అయితే, మనిషి రూపంలో వినాయకుడిని ఎప్పుడైనా ఊహించుకున్నారా? మనిషి రూపంలో వినాయకుడికి పూజలు ఎప్పుడైనా చేశారా? అంటే మనిషి తల కలిగిన వినాయకుడి విగ్రహానికి పూజలు చేయడం చూశారా? దాదాపు అసాధ్యమనే చెబుతారు. కానీ, మీరు భావించే తప్పు. వినాయకుడిని మనిషి తల రూపంలో పూజించే చోటు ఒకటి ఉంది. ఆ రూపంలో ఆయనకు ఒక గుడి కూడా కట్టించారు భక్తులు. ఆ గుడిలో నిత్యం పూజలు కూడా చేస్తుంటారు. మరి ఆ ప్రత్యేకమైన టెంపుల్ ఎక్కడుంది? ఆ టెంపుల్‌లో వినాయకుడి మనిషి రూపంలో ఉండటానికి కారణం ఏంటి? ఇందుకు సంబంధించిన ప్రత్యేక వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆది వినాయక దేవాలయం..
ఈ వినాయకుడి ఆలయం తమిళనాడులో ఉంది. ఈ ఆలయం పేరు ఆది వినాయకుడు టెంపుల్. ఇక్కడ గణేశుడు మనిషి రూపంలో పూజించబడతాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలా మనిషి రూపంలో వినాయకుడిని పూజించే ప్రపంచంలోనే ఏకైక ఆలయం ఆది వినాయకుని ఆలయం. ఈ ఆలయంలో గణపయ్య ముఖరూపం.. ఏనుగు తల రూపంలో కాకుండా పూర్తిగా మనిషి ముఖ రూపంలో ఉంటుంది.
మనిషి ముఖ రూపంలో ఎందుకు పూజిస్తారు?
గణేషుడిపై కోపోద్రిక్తుడైన శంకరుడు.. ఆ గణేషుడి తలను శరీరం నుంచి వేరు చేస్తాడు. ఆ తరువాత గణేషుడిని మొండెంపై ఏనుగు తలను అమరుస్తారు. అప్పటి నుంచి ముల్లోకాలూ ఏనుగు రూపంలో ఉన్న గణపతినే పూజిస్తారు. కానీ, ఇక్కడి భక్తులు మాత్రం గణపతి మొదటి రూపాన్నే పూజిస్తారు. గణపతి మొదట్లో ఎలా ఉండేవాడో.. ఆ రూపంలో ఆయన్ని ఆరాధిస్తారు భక్తులు. అందుకే ఈ ఆలయానికి ఆది వినాయకుడు అని పేరు కూడా పెట్టారు.
ఆదివినాయక ఆలయానికి ఎలా చేరుకోవాలి..
ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ జిల్లాలో కుట్నూర్ నుండి 3 కి.మీ దూరంలో తిల్లతర్పన్ పురి అనే ప్రదేశంలో ఉంది. ఈ ఆలయానికి విమానంలో కూడా వెళ్లవచ్చు. ఆలయానికి సమీపంలోనే విమానాశ్రయం ఉంది. అదేఏ తిరుచిరాపల్లి విమానాశ్రయం. ఇది సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ మీరు ట్రైన్‌లో వెళ్లాలనుకుంటే.. చెన్నై చేరుకున్న తరువాత తిరువారూరుకు రైల్‌లో వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..