దేశమంతా జై శ్రీరాం.. అయోధ్య రాముడి ఆలయం కోసం జనమంతా ఉత్సాహం.. రామమందిర నిర్మాణానికి 1,100 కోట్లు
అయోధ్యలో రామ మందిర నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందని, దానికయ్యే ఖర్చు రూ. 1,100 కోట్లు దాటిపోతుందని రామ మందిరం ట్రస్టు కోశాధికారి వెల్లడించారు. ప్రధాన ఆలయం మూడేళ్లలో పూర్తయిపోతుందని దానికి రూ.300–400..
దేశమంతా జై శ్రీరాం. అయోధ్య రాముడి ఆలయం కోసం జనమంతా ఉత్సాహం. కొందరిది ఉడతాభక్తి సాయం. మరికొందరిది భూరి విరాళం. రామమందిరానికి కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి.. శ్రీరాముడి సేవకు మేముసైతమంటూ ముందుకొచ్చారు రామ భక్తులు.
అయోధ్యలో భవ్య రామమందిరం. చరిత్రలో నిలిచిపోయేలా అద్భుత ఆలయం. “మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్” పేరుతో విరాళాల సేకరణ జోరుగా సాగుతోంది. రాములోరి గుడి నిర్మాణానికి మేముసైతమంటూ ముందుకొస్తున్నారు దేశ ప్రజలు. ఎవరికి తోచినంత వాళ్లు ఉడతాభక్తి సాయం చేస్తున్నారు. పది రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకూ విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందని, దానికయ్యే ఖర్చు రూ. 1,100 కోట్లు దాటిపోతుందని రామ మందిరం ట్రస్టు కోశాధికారి వెల్లడించారు. ప్రధాన ఆలయం మూడేళ్లలో పూర్తయిపోతుందని దానికి రూ.300–400 కోట్లు ఖర్చు అవుతుందని, అయితే ఆలయం చుట్టూ 70 ఎకరాలను అభివృద్ధి చేయడానికయ్యే మొత్తం ఖర్చు రూ.1,100 కోట్లు దాటిపోతుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ చెప్పారు. రామ మందిర నిర్మాణంలో పాలుపంచుకుంటున్న నిపుణులు వేసిన అంచనాల మేరకు తాను ఈ వివరాలు వెల్లడించానని తెలిపారు.