Rakhi Festival: మహాకాళుడి ఆస్థానంలో వైభవంగా రాఖీ సంబరాలు.. మహాకాళుడికి రాఖీ కట్టి 1.25 లక్షల లడ్డూలను సమర్పించిన మహిళలు..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రాఖీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. బాబా మహాకాళుడికి రాఖీ కట్టారు. పూజారుల కుటుంబాలకు చెందిన మహిళలు బాబా మహాకాళుడికి రాఖీ కట్టారు. ఇది మాత్రమే కాదు, బాబా మహాకాళుడికి 1.25 లక్షల లడ్డూల మహాభోగాన్ని అందించారు. ఉదయం నుంచే ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.

Rakhi Festival: మహాకాళుడి ఆస్థానంలో వైభవంగా రాఖీ సంబరాలు.. మహాకాళుడికి రాఖీ కట్టి 1.25 లక్షల లడ్డూలను సమర్పించిన మహిళలు..
Mahakaleshwar Temple Ujjain

Updated on: Aug 09, 2025 | 10:39 AM

దేశ వాప్తంగా శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమి రోజున రాఖీ పండగని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని బాబా మహాకాళుడికి పూజారి కుటుంబ మహిళలు ఈ రోజు ఉదయం భస్మ హారతి తర్వాత బాబా మహాకాళుడికి రాఖీ కట్టారు. రక్షా బంధన్ పండుగను బాబా మహాకాళుడి ఆస్థానంలో చాలా వైభవంగా జరుపుకున్నారు. ఈ ఉదయం మహాకాళేశ్వర ఆలయంలో పూజలు జరిగిన తర్వాత, పూజారి కుటుంబం బాబా మహాకాళుడికి 1.25 లక్షల లడ్డూల మహాభోగాన్ని సమర్పించింది.

ఈ ప్రసాదాన్ని ఉదయం నుంచి ఆలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడికి పంపిణీ చేయడం మొదలు పెట్టారు. మహాకాళేశ్వర ఆలయానికి చెందిన పూజారి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో, శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమి రోజున అంటే రక్షాబంధన్ రోజున పూజారి కుటుంబం బాబా మహాకాళుడిని పూజించి, ఆయనకు రాఖీ కడుతుందని చెప్పారు. దీనితో పాటు 1.25 లక్షల లడ్డూల మహాభోగాన్ని కూడా సమర్పిస్తారు.

తెల్లవారుజామున 3 గంటలకు బాబా మహాకాళ భస్మ హారతి

ఈరోజు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు బాబా మహాకాళుని భస్మ ఆరతి ప్రారంభమైంది. ఈ పూజ సమయంలో ముందుగా బాబా మహాకాళుడికి జలంతో అభిషేకం చేశారు. అనంతరం పంచామృతంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత భస్మ హారతి తర్వాత బాబా మహాకాళుడిని ఆకర్షణీయంగా అలంకరించారు. ఈ అలంకరణ తర్వాత పూజారుల కుటుంబాలకు చెందిన మహిళలు బాబా మహాకాళుడికి రాఖీ కట్టారు.

ఇవి కూడా చదవండి

దీని తరువాత దేశం, ప్రపంచ సంక్షేమం కోసం ప్రార్థించడంతో రాఖీ పండుగ ప్రారంభమైంది. ఈ రోజు బాబా మహాకాళుకు సమర్పించే రాఖీ సాధారణ రాఖీ కాదు, వేద రాఖీ. పూజారి కుటుంబం లవంగాలు, యాలకులు, తులసి దళాలు, బిల్వ పత్ర వేర్లతో మంత్రాలు జపిస్తూ దీనిని తయారు చేశారు. రాఖీ పండగ శుభ సందర్భంగా బాబా మహాకాళ ప్రాంగణాన్ని ఈరోజు రంగురంగుల పూలతో అలంకరించారు.

ఆకర్షణీయంగా బాబా మహాకాళ ఆస్థానం

గర్భగుడితో పాటు, నంది హాల్ కూడా ఈరోజు పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు. దీని కారణంగా బాబా మహాకాళ సభ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. బాబా మహాకాళను సందర్శించడానికి వచ్చిన భక్తులు కూడా ఆలయ ఆకర్షణీయమైన అలంకరణను ప్రశంసిస్తూ కనిపించారు. అలాగే బాబా మహాకాళ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత భక్తులు సంతోషించారు.

శ్రావణ మాసంలో ఉపవాసం ఉండే భక్తులు దీనిని తిన్న తర్వాతే ఉపవాసం విరమించే ప్రసాదం ఇదే. ఈ రోజు ఉదయం మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా శ్రావణ మాసం నెల రోజుల పాటు చేసిన ఉపవాస దీక్షను ముగించారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.