Pitra Dosh 2025: జాతకంలో పితృ దోషం ఉందా.. ఈ పరిహారాలతో పితృదేవతల ఆశీస్సులు మీ సొంతం
సనాతన ధర్మం విశ్వాసాల ప్రకారం పిత్ర పక్షంలో శ్రాద్ధ కర్మలను నిర్వహించడం వలన పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందుతాయి. పితృదేవతలు తమ వారసులను ఆశీర్వదిస్తారు. పూర్వీకులు సంతోషంగా లేకుంటే.. ఆ వ్యక్తి పిత్ర దోషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతారు. పితృ పక్షంలో పిత్ర దోషాన్ని తొలగించడానికి తీసుకునే చర్యలు ఏమిటో తెలుసుకుందాం..

జ్యోతిషశాస్త్రం ప్రకారం పితృ దోషం చాలా తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి జాతకంలో పితృ దోషం ఉంటే.. అతని జీవితంలో అనేక అడ్డంకులు ఉంటాయి. పితృ దోషం కూడా గత జన్మలో చేసిన పాపాల ఫలితమే అని చెబుతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకంలో సూర్యుడు, బృహస్పతి, చంద్రుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, శనీశ్వరుడు మొదలైన వారి కలయిక రాహువుతో ఏర్పడినప్పుడు లేదా ఇతర గ్రహాల కలయిక రాహువుటప్ ఏర్పడినప్పుడు పిత్ర దోషం సంభవిస్తుంది. అయితే పితృ దోషాన్ని తొలగించడానికి పితృ పక్ష సమయం చాలా మంచిదని భావిస్తారు. ఈ సమయంలో తీసుకునే కొన్ని చర్యలు శీఘ్ర ఫలితాలను ఇస్తాయి.
శ్రాద్ధ కర్మలు, తర్పణం పితృ పక్షంలో శ్రాద్ధ కర్మలు చేయడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. వీలైతే ఇంట్లోనే బ్రాహ్మణుడిని పిలిచి శ్రాద్ధకర్మలు నిర్వహించడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందుతాయని, వారి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. దీనితో పాటు మీరు తినడానికి ముందు.. తినే ఆహారంలో కొంత భాగాన్ని ఆవు, కుక్క, కాకి లేదా ఏదైనా ఇతర పక్షికి పెట్టడం ఫలవంతం.
పిండ ప్రదానం ప్రాముఖ్యత పితృ పక్ష సమయంలో గయ, వారణాసి, ఉజ్జయిని లేదా హరిద్వార్ వంటి పవిత్ర తీర్థయాత్ర స్థలాలలో పిండ ప్రదానాన్ని సమర్పించడం వలన పితృ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. మత విశ్వాసం ప్రకారం పిండ దానాన్ని సమర్పించడం వలన పూర్వీకులు మోక్షాన్ని పొంది వారి జీవితం సంతోషంగా ఉంటుంది.
దాతృత్వం పితృ పక్షంలో ఆహారం, వస్త్రాలు, నువ్వులు, బెల్లం, డబ్బులను దక్షిణగా దానం ఇవ్వాలి. ఈ సమయంలో ఆవులు, కుక్కలు, కాకులు, ఆవు దూడలకు ఆహారం ఇవ్వడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. ఈ పుణ్యం నేరుగా పితృదేవతల ఆత్మకు చేరుతుంది.
రావి చెట్టు పూజ రావి చెట్టు పూర్వీకుల నివాసంగా నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో పితృ పక్ష సమయంలో ప్రతిరోజూ రావి చెట్టుకు నీరు సమర్పించి, ఏడుసార్లు ప్రదక్షిణ చేయండి. ఈ సమయంలో ఓం పితృభ్యా నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది పితృ దోషాన్ని తగ్గిస్తుందని చెబుతారు.
గీత, గరుడ పురాణ పారాయణం పితృ పక్ష సమయంలో మత గ్రంథాలను పఠించడం చాలా పుణ్యప్రదమైనది. ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో గీత పారాయణం, గరుడ పురాణం వినడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
నల్ల నువ్వులతో తర్పణం పితృ దోషం నుంచి బయటపడటానికి, పిత్ర పక్ష సమయంలో పితృదేవతలకు నల్ల నువ్వులు, దర్భలు, నీటితో తర్పణం అర్పించాలి. పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెంది వారిని ఆశీర్వదిస్తాయని చెబుతారు. పురాణ గ్రంథాలలో పితృ దోషం నుంచి బయటపడటానికి ఇది సులభమైన పరిష్కారంగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








