Medaram: కొనసాగుతున్న హుండీల లెక్కింపు.. భారీగా సమకూరుతున్న ఆదాయం.. ఇప్పటివరకు ఎంత వచ్చిందంటే

తెలంగాణలో అట్టహాసంగా జరిగిన సమ్మక్క-సారలమ్మల జాతరకు(Sammakka-Saralamma Jatara) సంబంధించిన హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా సోమవారం నాటికి...

Medaram: కొనసాగుతున్న హుండీల లెక్కింపు.. భారీగా సమకూరుతున్న ఆదాయం.. ఇప్పటివరకు ఎంత వచ్చిందంటే
Medaram Jathara 2022 (1)
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 01, 2022 | 7:55 PM

తెలంగాణలో అట్టహాసంగా జరిగిన సమ్మక్క-సారలమ్మల జాతరకు(Sammakka-Saralamma Jatara) సంబంధించిన హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా సోమవారం నాటికి పది కోట్ల రూపాయలు దాటింది. హనుమకొండలోని(Hanumakonda) తితిదే కల్యాణ మండపంలో కానుకల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 450 హుండీల లెక్కింపు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఈ హుండీల ద్వారా రూ.10,00,63,980 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. బంగారం, వెండి ఆభరణాలతో పాటు విదేశీ కరెన్సీ(Foreign currency) కూడా ఉన్నట్లు వివరించారు. నాణేలను కూడా లెక్కించిన తర్వాత పూర్తి వివరాలు అందిస్తామన్నారు. లెక్కించిన నగదును దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకు అధికారులకు అప్పగించి బ్యాంకులో జమ చేస్తున్నారు. దేవస్ధానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సేవా బృందాల సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. లెక్కింపు జరిగే మండపం పరిసరాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

2020లో మేడారం జాతర సందర్భంగా రూ.15 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వాటిలో నగదు రూపంలో రూ.11.65 కోట్లు, 1,063 గ్రాముల బంగారం, 53 కిలోల వెండి సమకూరింది. అయితే ఈ సారీ జాతర ముందు నుంచే తల్లులను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మేడారం మహా జాతర సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మొత్తం కోటి ముప్పై లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా వేశారు. 50 లక్షల మందికి పైగా భక్తులు జాతరకు ముందే దర్శనాలు చేసుకున్నారు. వేడుక జరిగిన నాలుగు రోజుల్లోనూ రద్దీ కొనసాగింది. పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు.

Also Read

Goa Election 2022: రసవత్తరంగా గోవా రాజకీయం.. ఫలితాలకు ముందే బేరసారాలు.. ఆ ఐదుగురుపైనే నజర్

Kacha Badam Singer: సోషల్ మీడియా సెన్సెషనల్ కచ్చా బాదమ్‌ సింగర్‌కు యాక్సిడెంట్.. ఆసుపత్రిలో చికిత్స

Russia Ukraine War News: ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై రష్యా దాడులు.. ఇదిగో సాక్ష్యం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో