Ontimitta Temple: ఈ నెల 9 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
కోదండరాముడి ప్రఖ్యాత ఆలయం ఒంటిమిట్టలో(Ontimitta) ఈనెల 9 నుంచి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉత్సవాల ఏర్పాట్లను(arrangements) వేగంవంతం చేస్తున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు....
కోదండరాముడి ప్రఖ్యాత ఆలయం ఒంటిమిట్టలో(Ontimitta) ఈనెల 9 నుంచి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉత్సవాల ఏర్పాట్లను(arrangements) వేగంవంతం చేస్తున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రాకారం అంతర్భాగం చుట్టూ పందిరి, మాడ వీధులు, ఉద్యాన వనాలు, పుష్కరిణి, కాలిబాటలు, పార్కింగ్ ఏరియా, కల్యాణ వేదిక ప్రాంగణంలో అధిక కాంతినిచ్చే విద్యుద్దీపాలను ఏర్పాటు చేయిస్తున్నారు. విద్యుత్ కు అంతరాయం కలిగితే సమస్యలు రాకుండా జనరేటర్లు తెప్పించారు. వీవీపీఐ, వీఐపీ, సామాన్య భక్తులు ప్రాంగణంలోకి రావడానికి వేర్వేరుగా క్యూలైన్లు వేస్తున్నారు. కాలిబాటలో భక్తుల నడక సాగించడానికి అనువుగా చల్లదనం కోసం కూల్ పెయింట్ వేసే పనులు జరుగుతున్నాయి. బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.
రెండు లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు తయారు చేయించాలని నిర్ణయించారు. గతేడాది తెప్పించిన 100 కిలోల ముత్యాలు అలాగే ఉన్నాయి. అదనంగా మరో 40 కిలోలు తెప్పించడానికి అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులకు నివేదించారు. ఉద్యాన వనాలకు ఉత్సవ శోభ తీసుకొస్తున్నారు. ప్రసాదాల తయారీ కోసం తిరుపతిలో ఉన్న తితిదే సరకుల నిల్వ కేంద్రం నుంచి ఇక్కడికి తీసుకురానున్నారు.
Also Read