ఈ విచిత్రమైన యుద్ధంలో బికనీర్ సైన్యానికి రామచంద్ర ముఖియా నాయకత్వం వహించగా, నాగౌర్ సైన్యానికి సింఘ్వి సుఖ్‌మల్ నాయకత్వం వహించాడని స్థానికులు చెబుతారు. రెండు సంస్థాన రాజులకు అప్పటి వరకు పుచ్చకాయ గురించి జరుగుతున్న గొడవ ఏమీ తెలియనప్పటికీ, ఆ సమయంలో బికనీర్ పాలకుడు రాజా కరణ్ సింగ్ యాత్రలో ఉండగా, నాగౌర్ పాలకుడు రావు అమర్ సింగ్ మొఘల్ సేవలో ఉన్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు రాజులు మొఘల్ రాజుల ఏలుబడిలో ఉన్నారు. రాజులిద్దరూ ఈ యుద్ధం గురించి తెలుసున్న తర్వాత .. మొఘల్ రాజులు జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే అప్పటికి చాలా ఆలస్యం అయింది. విషయం మొఘల్ కోర్టుకు చేరుకోకముందే యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో నాగౌర్ సంస్థానం ఓడిపోయినప్పటికీ, రెండు వైపులా వేలాది మంది సైనికులు మరణించారని ఇప్పటికీ అక్కడ స్థానికులు చెబుతారు.