Indrakeeladri: స్వరస్వతి దేవిగా దుర్గమ్మ.. పోటెత్తిన భక్తులు.. అమ్మవారిని దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్, పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

ఈ రోజు ప్రభుత్వం తరపున అమ్మవారికి సిఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య ఇంద్రకీలాద్రికి సిఎం చేరుకోనున్నారు. మరోవైపు ఈ రోజు ఉదయం ఇంద్రకీలాద్రికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమును దర్శించుకోనున్నారు పవన్ కళ్యాణ్.

Indrakeeladri: స్వరస్వతి దేవిగా దుర్గమ్మ.. పోటెత్తిన భక్తులు.. అమ్మవారిని దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్, పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
Durgamma As Saraswati Devi
Follow us
Surya Kala

|

Updated on: Oct 09, 2024 | 8:40 AM

ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ రోజు దసరా ఉత్సవాలు ఏడో రోజుకు చేరాయి. నేడు అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం కావటంతో దుర్గాదేవి శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ రోజు ప్రభుత్వం తరపున అమ్మవారికి సిఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య ఇంద్రకీలాద్రికి సిఎం చేరుకోనున్నారు. మరోవైపు ఈ రోజు ఉదయం ఇంద్రకీలాద్రికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమును దర్శించుకోనున్నారు పవన్ కళ్యాణ్.

ఈ రోజు దుర్గాదేవి శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులతో క్యూ లైన్స్ లు కిక్కిరిశాయి. భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో ఈ రోజు దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే అన్ని రకా విఐపి ,సిఫారసు లేఖలను రద్దు చేశారు ఆలయ అధికారులు. భక్తుల రద్దీ దృష్ట్యా అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తుల సౌకర్యార్ధం లైన్స్ ను అన్నిటినీ ఫ్రీ లైన్స్ చేశారు అధికారులు. కంపార్ట్మెంట్స్ నుంచి విడతలవారీగా భక్తులను దర్శనానికి పంపుతున్నారు పోలీసులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..