AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2024: గోపికలు పూజించిన ద్వాపర కాలం నాటి కాత్యాయనీదేవి ఆలయం.. నేటికీ కోరిక కోర్కెలు తీర్చే అమ్మవారు.. ఎక్కడంటే

బృందావనంలో కన్నయ్య గోపికలతో ఆడుకుంటూ బాల్యాని గడిపాడు. గోపికల మనస్సులలో కృష్ణుడిని భర్తగా పొందాలనే కోరిక పుట్టింది. దీంతో గోపికలు ప్రతిరోజు ఉదయం బ్రహ్మ మూర్హుతంలో నిద్రలేచి యమునా నదిలో స్నానం చేసి, కాత్యాయనీ మాత విగ్రహాన్ని తమ చేతులతో తయారు చేసి,'కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యాధీశ్వరీ' | నంద గోపసుతం దేవిపతిం మే కురు తే నమఃనంద్ గోప్సుతం దేవిపతి మే కురు తే నమః.' అనే మంత్రములతో పూజించారు.

Navaratri 2024: గోపికలు పూజించిన ద్వాపర కాలం నాటి కాత్యాయనీదేవి ఆలయం.. నేటికీ కోరిక కోర్కెలు తీర్చే అమ్మవారు.. ఎక్కడంటే
Katyayani Devi Temple
Surya Kala
|

Updated on: Oct 09, 2024 | 1:38 PM

Share

నవరాత్రులలో అమ్మవారి వివిధ రూపాలను పూజిస్తారు. వీటిలో తల్లి కాత్యాయని రూపం కూడా ఒకటి. ఢిల్లీకి సమీపంలో కాత్యాయని దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరిగి రాలేదని చెబుతారు. అయితే ఈ కాత్యాయనీ దేవి ఆలయం కంటే ముందు కన్నయ్య దేవుడి నివాసమైన బృందావనంలోని కాత్యాయనీ మాత ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం ఇప్పటిది కాదు ద్వాపర యుగం నాటిది అని నమ్మకం. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ద్వాపర యుగంలో గోపికలు స్వయంగా తమ చేతులతో తయారు చేశారని నమ్మకం. ఇక్కడ అమ్మవారిని పూజించిన తరువాత అమ్మ దయతో శ్రీకృష్ణుడిని తమ వరుడిగా కోరుకున్నారు. గోపికలు కోరిక నెరవేరింది. అనంతరం ఈ ఆలయం మునులు, సాధువులు తపస్సు చేసే ప్రదేశంగా మారింది. ఈ ప్రదేశంలో తపస్సు చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. శ్రీమద్ భగవత్‌ పురాణంలో ఉన్న ఈ ఆలయ ప్రస్తావన గురించి తెలుసుకుందాం..

శ్రీమద్ భగవత్ కథ ప్రకారం, శ్రీకృష్ణుడు 11 సంవత్సరాల 56 రోజులు బృందావనంలో ఉన్నాడు. బృందావనంలో కన్నయ్య గోపికలతో ఆడుకుంటూ బాల్యాని గడిపాడు. గోపికల మనస్సులలో కృష్ణుడిని భర్తగా పొందాలనే కోరిక పుట్టింది. దీంతో గోపికలు ప్రతిరోజు ఉదయం బ్రహ్మ మూర్హుతంలో నిద్రలేచి యమునా నదిలో స్నానం చేసి, కాత్యాయనీ మాత విగ్రహాన్ని తమ చేతులతో తయారు చేసి,’కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యాధీశ్వరీ’ | నంద గోపసుతం దేవిపతిం మే కురు తే నమఃనంద్ గోప్సుతం దేవిపతి మే కురు తే నమః.’ అనే మంత్రములతో పూజించారు.

గోపికల కోరికలు ఎలా నేరవేరిందంటే

కన్నయ్య గోపికల ఆరాధనకు సంతోషించాడు. అఘాసురుడిని సంహరించిన తరువాత ఒక సంవత్సరం విరామం ఉన్నప్పుడు భగవానుడు స్వయంగా బృందావనంలోని గోవులందరికి కాపరిగా మారాడు. ఆ సమయంలో శ్రీమద్ భగవత్ కథ ప్రకారం గోపికలందరినీ వివాహం చేసుకున్నాడు. దీనికి బృందావనంలో 11 సంవత్సరాల 56 రోజులు గడిపాడు. ఆ తర్వాత కన్నయ్య స్వయంగా కంసుడిని చంపడానికి మధురకు వెళ్ళే సమయం ఆసన్నం అయిందని గుర్తించి.. కన్నయ్య ఈ ఆలయానికి వచ్చి కంసుడి వధ గురించి తెలిపుతూ ఆచారాల ప్రకారం తల్లిని స్తుతించాడు. తరువాత, చాలా మంది ఋషులు ఈ ప్రదేశంలో మాతృమూర్తిని పూజించి, కోరుకున్న ఫలితాలను సాధించారు.

ఇవి కూడా చదవండి

శక్తిపీఠం మాతృ దేవత ఆలయం

దేవీ పురాణం,మార్కండేయ పురాణం ప్రకారం ఈ ఆలయం సతీదేవి జుట్టు పడిపోయిన ప్రదేశం. కనుక ఈ ప్రదేశం శక్తిపీఠం కూడా. నేటికీ ఇక్కడ అమ్మవారిని నిర్మలమైన మనసుతో ‘కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యాధీశ్వరీ అని ప్రార్ధిస్తే కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. ముఖ్యంగా వివాహంలో అడ్డంకులు ఎదుర్కునే వారు, వారి జాతకంలో ఉన్న గ్రహ దోషాల కారణంగా దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొనే వారు ఈ ఆలయంలో పూజలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు.

కాత్యాయని మాత ఎవరు?

దేవి భగవత్ కథనం ప్రకారం కాత్య ఋషి గోత్రంలో కాత్యాయన అనే మహర్షి ఉండేవాడు. మహర్షి భగవతీ దేవి కోసం చాలా తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన శక్తిస్వరూపిణి మహర్షికి ప్రత్యక్షమై వరం కోరమని కోరింది. ఆ సమయంలో మహర్షి ఆ తల్లి రూపానికి ముగ్ధుడై ఆమెను కూతురి రూపంలో పొందాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.మహర్షి కోరిక మేరకు ఆ ఇంటి జన్మించిన అమ్మవారు కాత్యాయనీ దేవిగా భక్తులతో పూజలను అందుకుంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి