AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mystery Temple: 3 వేల ఏళ్లనాటి శివాలయం నేటికీ సైన్స్ చేధించని మిస్టరీనే.. ఏడాది పొడవునా నీరు వ్యాధులను నయం చేసే గుణం

భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. కొండ కోనల్లో అనేక ఆలయాలు, పుణ్యక్షేత్రలున్నాయి. అనేక పురాతన ఆలయాల్లో రహస్యాలు దాగున్నాయి. నేటి మానవ మేథస్సుకు సవాల్ విసురుతూ నేటికీ చేధించని ఎన్నో మిస్టరీలను దాచుకుననాయి. ఎటువంటి ఆధునిక సౌకర్యాలు లేకుండా ఆలయాల నిర్మాణంతో పటు శిల్ప కళ సంపద నేటి మానవుడికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతున్నాయి. అలాంటి మిస్టరీ ఆలయాల్లో ఒకటి కేరళలో ఉంది. ఇది 3000 ఏళ్ల నాటి పురాత దేవాలయం. సైంటిస్టులకే సవాల్ విసురుతున్న ఆలయం గురించి తెలుసుకుందాం..

Mystery Temple: 3 వేల ఏళ్లనాటి శివాలయం నేటికీ సైన్స్ చేధించని మిస్టరీనే.. ఏడాది పొడవునా నీరు వ్యాధులను నయం చేసే గుణం
Mystery Shiva Temple
Surya Kala
|

Updated on: Apr 09, 2025 | 5:45 PM

Share

మన దేశంలో వేల సంవత్సరాల నాటి పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల నిర్మాణం నేటికీ మిస్టరీకి కేరాఫ్ అడ్రస్‌గా మారి సైన్స్ కే సవాల్ విసురుతున్నాయి. ఆలయ నిర్మాణం నుంచి గర్భ గుడిలో కొలువైన దేవుడి వరకూ అంతా మిస్టరీనే. అలాంటి ఆలయంలో ఒకటి కేరళలోని పుత్తుర్ గ్రామంలో ఉంది. 3 వేల ఏళ్ల నాటి పురాతన శివాలయం నీర్ పుతూర్ మహదేవ్ ఆలయంలోని రహస్యాని సైంటిస్టులు సైతం ఛేదించలేకపోతున్నారు.

ఈ ఆలయంలోని శివలింగం స్వయంగా ఉద్భవించిందట. ఈ గర్భ గుడిలోని శివలింగమే కాదు..శివలింగం ఉన్న గర్భగుడి ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది, ఇది అనేక మంది సందర్శకులను ఆకర్షించే ప్రశాంతమైన, నిర్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. భారత పురావస్తు సర్వే ప్రకారం ఈ ఆలయం మూడు వేలకు పైగా చరిత్ర ఉంది. పురాతన వాస్తుశిల్పం, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు వేదికగా నిలుస్తుంది.

ఆలయం చుట్టూ ఉన్న నీరు కూడా ఓ మిస్టరీనే. ఇక్కడ నీరు ఏడాది పొడవునా అదే విధంగా ఉంటాయి. ఎంత ఎండలు వచ్చినా నీరు ఎండిపోవు. ఒకే లెవెల్ లో ఏడాది పొడువునా ఆలయం చుట్టూ నీరు ఉండడం సైంటిస్టులకు నేటికీ అంతుచిక్కని మిస్టరీనే. ఈ నీరు ఎక్కడ నుంచి వస్తున్నాయో ఎవరికీ అంతుచిక్కని రహస్యమే. అంతేకాదు ఈ నీటికి వ్యాధులను నయం చేసే ఔషధగుణాలున్నాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న నీటిలో ఉన్న ఔషధ గుణాలతో తాగిన వారికి వ్యాధులు నయం అవుతాయట.

ఇవి కూడా చదవండి

సైంటిస్టులకు సవాల్

ఈ మహాదేవుడి ఆలయంలోని మిస్టరీని చేధించడానికి సైంటిస్టులు చాలా ప్రయాసపడుతున్నారు. గుడి గురించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆలయాన్ని మలబార్ దేవస్వం బోర్డు నిర్వహిస్తుంది. ప్రతి ఒక్కరూ భక్తి, ధ్యానంతో కూడిన ప్రయాణాన్ని ప్రారంభించమని ఆహ్వానిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి