Sankatahara Chathurhi: మృతదేహంపై నుంచి వీచిన గాలికి కదిలిన ఇంద్రుని వాహనం.. సంకష్ట హర చతుర్థి కథ ఇదే

విఘ్నాలు తొలగించే ఆది దేవుడు విఘ్నేశ్వరుడికి అత్యంత ఇష్టమైన తిథులలో చవితి ప్రధానమైనది. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజు చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్ట హర చతుర్థి లేదా సంకటహర చతుర్థి...

Sankatahara Chathurhi: మృతదేహంపై నుంచి వీచిన గాలికి కదిలిన ఇంద్రుని వాహనం.. సంకష్ట హర చతుర్థి కథ ఇదే
Sankatahara
Follow us

|

Updated on: Mar 21, 2022 | 8:12 AM

విఘ్నాలు తొలగించే ఆది దేవుడు విఘ్నేశ్వరుడికి అత్యంత ఇష్టమైన తిథులలో చవితి ప్రధానమైనది. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజు చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్ట హర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అంటారని పురాణాలు పేర్కొన్నాయి. దేవ రాజు అయిన ఇంద్రుడు.. తన విమానంలో బృఘండి అనే ఋషి వద్దకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ఇంద్రలోకానికి వెళ్తుండగా ఘర్‌సేన్‌ అనే రాజు ఇంద్రుడి విమానాన్ని రాజ్యం దాటే సమయంలో, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చూశాడు. ఇంద్ర విమానం తేజో ప్రకాశానికి ఆశ్చర్యపోయిన సురసేనుడు.. ఇంద్రుడిని చూసి గౌరవ నమస్కారం చేశాడు. ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయిందని ఇంద్రుడు సురసేనుడికి చెప్పాడు. ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని ఇంద్రుడు కోరాడు. ఇంద్రుడి విన్నపాన్ని మన్నించిన సురసేనుడు.. చతుర్ధి నాడు ఉపవాసం చేసిన వారి వివరాలు తెలుసుకోవాలని సైనికులను పురమాయించాడు. అయితే దురదృష్టవశాత్తు ఎవరూ తారసపడలేదు.

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి చేరుకుంటారని చెప్పాడు.

ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని సైనికులు గణేశ దూతను విజ్ఞప్తి చేశారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేశ దూత అంగీకరించలేదు. మృత శరీరం పై నుంచి వీచిన గాలికి ఆగిపోయిన విమానంలో చలనం కలిగింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు వివరిస్తోంది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వల్ల పుణ్యం కలుగుతుందని నమ్ముతారు.

ఇవీ చదవండి.

Yadadri: ఇవాళ యాదాద్రిలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ.. వారం రోజులపాటు పంచకుండాత్మక మహాయాగం

Viral Video: నిజమైన టామ్ అండ్ జెర్రీ ఫైట్‌‌ను ఎప్పుడైనా చూశారా? అయితే ఇప్పుడు చూసి కడుపుబ్బా నవ్వుకోండి..!

అభిమానులకు సోషల్ మీడియాలో ఎప్పుడు దగ్గరగా ఉండే మెగా కోడలు…