Transgender Festival: ఘనంగా జరిగిన కూవాగం ఉత్సవాలు.. భారీగా పాల్గొన్న ట్రాన్స్ జెండర్స్.. వృత్తి, విద్యపై అవగాహన
Transgender Festival: కూవాగం ఉత్సవం(Koovagam Festival) తమిళనాడులోని(Tamilandu) కళ్ళకూరిచి సమీపంలోని ప్రసిద్ధ కూతాండవర్ ఆలయంలో అరవాన్‌ను ఆరాధించడానికి ఉత్సావాలు చేస్తారు.
Transgender Festival: కూవాగం ఉత్సవం(Koovagam Festival) తమిళనాడులోని(Tamilandu) కళ్ళకూరిచి సమీపంలోని ప్రసిద్ధ కూతాండవర్ ఆలయంలో అరవాన్‌ను ఆరాధించడానికి ఉత్సావాలు చేస్తారు. అరవాన్ (కూతాండవర్) మరణానికి సంతాపం తెలుపుతూ ట్రాన్స్ జెండర్స్ తాళిని తెంచుకుంటారు. మహాభారత యుద్ధానికి ముందు బలి ఇవ్వాల్సిన అరవాన్‌ను వివాహం చేసుకోవడానికి శ్రీ కృష్ణుడు మోహినీ రూపాన్ని ధరించాడని ఇక్కడి స్థల పురాణం.
18 రోజులపాటు చితిరై ఉత్సవాలు కళ్లకురిచి జిల్లాలోని కూతాండవర్‌లో ఏటా జరుగుతాయి. ఈ సంవత్సరం, ఉత్సవం ఏప్రిల్ 5 న ప్రారంభమైంది. రెండేళ్ల విరామం తర్వాత కూవాగంలోని కూతాండవర్ ఆలయ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది ట్రాన్స్ జెండర్స్ తరలివచ్చారు. ఆటలు, పాటలు, సంగీతంతో నిండిన ఫాషన్ షో ముగిసిన తరువాత రెండో రోజు పెళ్లిచేసుకోవాలి అనుకునే వారంతా వధువుల వేషధారణలను ధరించి ఆలయ పూజారిని దేవుడిగా భావించి తాళి కట్టించుకుంటారు.
ట్రాన్స్‌జెండర్లకు ఇది ఒక ప్రత్యేక సందర్భం. పెళ్లిచేసుకోవాలి అనుకునే తమ కోరికని పూజారితో తాళి కట్టించుకొని ఈ ఆలయం లో నెరవేర్చుకుంటారు. ఆలయ ఉత్సావాలు ముగింపు రోజున జరిగిన వితంతు వేడుకల్లో పాల్గొని తమ తాళిని తెంచుకొని దేవుడి ముందు రోదిస్తూ అక్కడినుండి వెళ్ళిపోతారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉత్త్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ట్రాన్స్ జెండర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వృత్తి, విద్య వాటిపై ట్రాన్స్ జెండర్లకు అవగాహన కల్పిస్తారు.