Money Plant: మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే ధనలక్ష్మి మీ వెంటే.. ఎక్కడ, ఎలా నాటాలంటే..

ప్రస్తుత కాలంలో ఇండోర్ ప్లాంట్స్ వైపు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. పట్టణాల్లో ఇండోర్ ప్లాంట్స్.. చిన్న చిన్న మొక్కలతో ఇంటిని అందంగా అలంకరిస్తున్నారు.

Money Plant: మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే ధనలక్ష్మి మీ వెంటే.. ఎక్కడ, ఎలా నాటాలంటే..
Money Plant
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2022 | 10:31 AM

ప్రస్తుత కాలంలో ఇండోర్ ప్లాంట్స్ వైపు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. పట్టణాల్లో ఇండోర్ ప్లాంట్స్.. చిన్న చిన్న మొక్కలతో ఇంటిని అందంగా అలంకరిస్తున్నారు. అయితే ఇంట్లో పెంచుకునే చెట్లలో పలు రకాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా అందరికి తెలిసిన చెట్టు మనీ ప్లాంట్. సాధారణంగా ఈ చెట్టు చాలా మంది ఇళ్లలో ఉంటుంది. ఇది కేవలం అలంకరణగా మాత్రమే కాకుండా.. శాస్త్రా ప్రకారం కూడా మంచిదే. ఇది మీ ఆర్థిక స్థితిని మార్చడానికి .. ధనలాభాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇంట్లో మనీ ప్లాంట్ నాటేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. జీవావరణ శాస్త్రం ప్రకారం ఈ నియమాలను పాటిస్తూ మనీ ప్లాంట్ నాటితే ధనలక్ష్మి మీ వెంటే ఉంటుంది. అలాగే రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది.

వాస్తు ప్రకారం ఆగ్నేయంలో మనీ ప్లాంట్ ఉంటే మంచిది. ఇది ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇంట్లో ఆనందం, మానసిక శాంతిని కలిగి ఉండాలంటే.. ఈ మనీ ప్లాంట్‏ను తాడు లేదా కొమ్మ సహాయంతో పైకి కట్టాలి. ఇలా చేస్తే మీ ప్రతిష్ట పెరుగుతుంది. అలాగే ఇంటికి ఉత్తర ద్వారం వద్ద మనీ ప్లాంట్ ఉంచడం వలన కొత్త ఆదాయ వనరులు ప్రారంభమవుతాయి. దీంతో మీ జీవితంలో అన్ని విజయాలే చోటు చేసుకుంటాయి. మనీ ప్లాంట్లను ఎప్పుడు పొడిగా ఉంచకూడదు… ఈ చెట్టుకు ఎల్లప్పుడు నీరు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

ఇక మనీప్లాంట్ ను ఎప్పుడు ఆరుబయట ఉంచకూడదు. ఎప్పుడూ కూడా ఈ చెట్టు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇతరుల దృష్టి ఎక్కువగా మనీ ప్లాంట్ పై పడకూడదు.. చెడ్డవారి చూపు తగిలి ఈ చెట్టు ఎండిపోతుంది. అందుకే ఇతరులకు కనిపించకుండా ఇంట్లో పెట్టాలి. ఈ చెట్లను గాజు కుండీలలో లేదా పచ్చని కుండీలలో పెడితే సంపద పెరుగుతుంది. రెడ్ మనీ ప్లాంట్ ను నివారించడం కూడా మంచిది కాదు. దీంతో అనర్థాలు వచ్చే అవకాశం ఉంది. మనీ ప్లాంట్స్ యాదృచ్చికంగా పెరుగుతాయి. కాబట్టి వీటిని కంటైనర్లలో ఉంచితే లాభాలు పెరుగుతాయి. మనీ ప్లాంట్ సంపదకు చిహ్నంగా ఉంటుంది. ఈ చెట్టును కొనుగోలు చేసేటప్పుడు ముదురు ఆకుపచ్చ రంగు.. లేదా మంచి పండు రంగులో తీసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని గుర్తుంచుకోండి.

Also Read: Samantha: పూజా హెగ్డే ఛాలెంజ్‏కు సమంత కౌంటర్.. లేట్ అయితే ఇలాగే ఉంటుందంటూ..

Health Tips: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా ? అయితే ప్రమాదమే అంటున్న నిపుణులు..

Amala Paul: అమలా పాల్‌ కండిషన్‌కు అదిరిపడ్డ నిర్మాతలు.. మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ..

Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..