Sabarimala Temple: అయ్యప్ప దర్శనానికి మళ్లీ బ్రేక్.. భారీ వర్షాల కారణంగా దర్శనాలు నిలిపివేసిన అధికారులు..
Sabarimala Temple: శబరిమలలో భక్తుల సందడి మొదలైంది. కేరళ సహా దేశ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు.. స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నాయి.
Sabarimala Temple: శబరిమలలో భక్తుల సందడి మొదలైంది. కేరళ సహా దేశ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు.. స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నాయి. అయితే, కేరళతో పాటు.. పొరుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో శబరిమల అయ్యప్ప దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు ఆలయ అధికారులు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆలయం ఉన్న కొండలను దర్శించుకునేందుకు పతనంతిట్ట జిల్లా యంత్రాంగం యాత్రికులను అనుమతించింది. భారీ వర్షాల కారణంగా కేరళలోని పంబా వంటి ప్రధాన నదుల్లో నీటిమట్టం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆలయం చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఒక్కరోజులో 20 వేల మంది బుక్ చేసుకున్నారు.. ఇదిలాఉంటే.. నిలక్కల్‌లో చిక్కుకున్న భక్తులు శబరిమల వెళ్లి పూజలు చేసుకునేందుకు అనుమతినిస్తూ జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్మన్ అయ్యర్, శబరిమల అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అర్జున్ పాండియన్ మధ్య పాదయాత్ర పునఃప్రారంభంపై చర్చ జరిగింది. అయితే, శనివారం ఒక్క రోజే అయ్యప్ప దర్శనానికి 20 వేల మంది భక్తులు టికెట్లను బుక్ చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
Also read: