Kanwar Yatra 2023: ఈ ఏడాది జంట శ్రవణాలు.. కన్వర్ యాత్ర ఎప్పుడు ప్రారంభం.. జలాభిషేకం తేదీ తెలుసుకోండి..
ఈ ఏడాది జంట శ్రావణ మాసాలు రానున్నాయి. ఒక శ్రావణ మాసాన్ని నిజ శ్రవణంగా రెండో మాసాన్ని అధిక శ్రవణంగా వ్యవహరిస్తారు. అయితే ఈ రెండు నెలలు భక్తులు పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శివయ్యను పూజించే కన్వర్ యాత్ర ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభమవుతుంది.. శివలింగానికి ఎప్పుడు జలాభిషేకం చేస్తారో తెలుసుకుందాం.

హిందువులకు శ్రావణ మాసం పండగలు, పర్వదినాలు శుభకార్యాలకు విశిష్ట మాసం. ఈ మాసంలో లక్ష్మీదేవి, మంగళగౌరి వ్రతంతో పాటు మహా శివుడిని పూజిస్తారు. అయితే ఈ ఏడాది జంట శ్రావణ మాసాలు రానున్నాయి. ఒక శ్రావణ మాసాన్ని నిజ శ్రవణంగా రెండో మాసాన్ని అధిక శ్రవణంగా వ్యవహరిస్తారు. అయితే ఈ రెండు నెలలు భక్తులు పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శివయ్యను పూజించే కన్వర్ యాత్ర ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభమవుతుంది.. శివలింగానికి ఎప్పుడు జలాభిషేకం చేస్తారో తెలుసుకుందాం.
కన్వర్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..
ఉత్తరాఖండ్ జ్యోతిష్య మండలి అధ్యక్షుడు పండిట్ రమేష్ సెమ్వాల్ ప్రకారం.. ఈ సంవత్సరం కన్వర్ యాత్ర జూలై 4, 2023 నుండి ప్రారంభమవుతుంది.. జూలై 15, 2023 వరకు కొనసాగుతుంది. జులై 15న శివ భక్తులు శివలింగానికి నీటిని సమర్పిస్తారు. శివలింగానికి నీటిని సమర్పించే శుభ సమయం రాత్రి 08:32 గంటలకు ప్రారంభమవుతుంది.. జూలై 16, 2023 వరకు కొనసాగుతుంది.




మహాదేవునికి నీరు సమర్పించడానికి 2 రోజులు శుభకాలం. అయితే ఉత్తమమైన శుభ సమయం మాస శివరాత్రి కాలం ఉన్న 15 జూలై 8:32 గంటలకు వరకూ అని పండిట్ రమేష్ సెమ్వాల్ చెప్పారు.
ఈ సంవత్సరం శ్రావణ మాసం రెండు నెలల పాటు ఉన్నా.. కన్వర్ యాత్ర మునుపటిలాగే జరుగుతుంది. శివ భక్తులు జూలై 04 నుండి తమ తమ ప్రాంతాల నుండి నది నీటి సేకరణకు బయలు దేరి.. శివలింగానికి జూలై 15, 2023న సమర్పించాల్సి ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం శివుని ఆరాధనకు సంబంధించిన మొదటి కన్వర్ యాత్రను పరశురాముడు చేసాడు. పాప పరిహారం కోసం పరశురాముడు హరిద్వార్ నుండి గంగాజలాన్ని తీసుకొని పుర మహాదేవుడికి సమర్పించాడు. ఇక్కడ పుర మహాదేవ్‌లోని శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్టించడానికి విశ్వాసం. ఆ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తూ.. స్థానికులు కన్వర్ యాత్రను చేపడతారు.
శివుడికి జలాభిషేకం ఎందుకు చేస్తారంటే..
హిందువుల విశ్వాసం ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాణి చిలికిన సమయంలో విషం ఉద్భవించగా.. శివుడు ఆ విషాన్ని తన కంఠంలో దాచి విశ్వాన్ని రక్షించాడు. అప్పుడు శివుడు కంఠం నీలం రంగులోకి మారడంతో నీలకంఠుడి గా ఖ్యాతిగాంచాడు. శివుని గొంతులో పేరుకుపోయిన విషం శక్తిని తగ్గించడానికి భక్తులు ఈ కన్వర్ యాత్రను చేపట్టి నది నుంచి గంగా జలం తీసుకుని వచ్చి శివయ్యకు ప్రత్యేకంగా అభిషేకం చేస్తారని తెలుస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
